Share News

రైల్వేకోడూరును కానుకగా ఇస్తాం

ABN , Publish Date - May 14 , 2024 | 10:39 PM

ఎన్నికలు ముగిశాయి. మెజార్టీపైనే నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవారం టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి ఐదు మండలాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు.

రైల్వేకోడూరును కానుకగా ఇస్తాం
ముక్కావారిపల్లె లో ప్రధాన నేతలతో చర్చిస్తున్న ముక్కా రూపానందరెడ్డి

టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి

కాకిలెక్కల్లో నేతలు

విజయంపై ఎవరి ధీమా వారిది..

రైల్వేకోడూరు, మే 14: ఎన్నికలు ముగిశాయి. మెజార్టీపైనే నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవారం టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి ఐదు మండలాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఏయే పోలింగ్‌ కేంద్రం నుంచి ఎంత మెజార్టీ వస్తుందో బేరీజు వేసుకున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్‌ విజయం ఖాయమని చెబుతున్నారు. పోలింగ్‌ తీరును బట్టి జనసేన కు అత్యంత మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నాయకులు చెబుతున్నారు. వైసీపీ కంచుకోటల్లో కూడా జనసేన, బీజేపీకి ఓట్ల వర్షం కురిసిందని చెబుతున్నారు. పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె, చిట్వేలి మండలాలు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉండేవి. ఈ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. ప్రతి బూతలో పడిన ఓటింగ్‌ శాతం చూస్తే వైసీపీ కోటలు బద్దలు అయినట్లు కనిపిస్తున్నాయి. ఐదు మండలాల్లో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా కష్టపడ్డారని టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరులో విజయం సాధిస్తామని ఈ విజయాన్ని చంద్రబాబు, పవనకళ్యాణ్‌లకు కానుకగా ఇస్తామని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

మెజారిటీపై ఇరు పార్టీల్లో ధీమా

ఒంటిమిట్ట: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో మండలంలో ఇరుపార్టీల నాయకులు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ నాయకులు తమ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో కాకి లెక్కలు వేసుకుంటున్నారు. మండల వ్యాప్తంగా 32 బూతుల్లో 24,577 ఓట్లకుగానూ 19,544 ఓట్లు పోలవడంతో 79.56 శాతంగా నమోదైంది. వైసీపీకి నాలుగు నుంచి 5 వేల మెజారిటీ వస్తుందని నాయకులుఽ దీమా వ్యక్తం చేస్తుండగా టీడీపీ తమకు కనీసం 1000 ఓట్ల మెజారిటీ తగ్గదని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నుంచి ఐదు వేల మధ్య మెజారిటీపై పెద్దఎత్తున పందెం రాయుళ్లు పందెం కాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై మండల వ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - May 14 , 2024 | 10:39 PM