Share News

నాణ్యమైన విత్తన కాయలను సరఫరా చేయాలి

ABN , Publish Date - May 30 , 2024 | 11:16 PM

రైతులకు నాణ్యమైన విత్త న కాయలు సరఫరా చేయాలని డీఏఓ చంద్రా నాయక్‌ అధికారులకు సూచించారు.

నాణ్యమైన విత్తన కాయలను సరఫరా చేయాలి
వేరుశనగ విత్తన కాయల పంపిణీని పరిశీలిస్తున్న డీఏఓ చంద్రానాయక్‌

గుర్రంకొండ, మే 30: రైతులకు నాణ్యమైన విత్త న కాయలు సరఫరా చేయాలని డీఏఓ చంద్రా నాయక్‌ అధికారులకు సూచించారు. గురువారం తరిగొండ ఆర్బీకేలో రైతన్నలకు సబ్సిడీపై పంపి ణీ చేస్తున్న విత్తన కాయలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వేరుశనగ విత్తన కాయ లను రైతలందరికీ చేరేలా చూడాలని సిబ్బందికి సూచించారు. విత్తన కాయలు సరిగా లేకుంటే తిరిగి పంపాలన్నారు. పంటలను రైతులు ఈ క్రాప్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం సబ్సిడీ విత్తన కాయలను రైతులకు అందజేశా రు. ఎంఏఓ నవీన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

విత్తన కాయలు సద్వినియోగం చేసుకోవాలి

తంబళ్లపల్లె, మే 30: ఖరీఫ్‌ సాగుకు ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న వేరుశనగ విత్తన కాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాల ని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్‌ సూచించారు.

మండల ఆర్బీకేల్లో వ్యవసాయాధి కారులు ప్రారంభించిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల పంపిణీని పరిశీలించారు. కుక్కరాజుప ల్లెలో విత్తన కాయల పంపిణీ, రికార్డులను పరి శీలించారు. మొదటి రోజు సుమారు 1400 మం ది రైతులకు దాదాపు 1000 క్వింటాళ్లు వేరు శనగ విత్తన కాయలు పంపిణీ చేసినట్లు తెలి పారు. విత్తన కాయల పంపిణీలో ఏవైనా అవక తవకలు జరిగినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఓ రమణ కుమార్‌, వీఏఏలు, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనకాయలను

అందిచడమే లక్ష్యం : ఏడీఏ

పెద్దతిప్పసముద్రం మే 30: ప్రతి రైతుకూ నాణ్యమైన వేరుశనగ విత్తన కాయలను అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని మదనపల్లె వ్యవసా య శాఖ ఏడీఏ దీక్షాకుమారి పేర్కొన్నారు. ఏఓ ప్రేమలతతో కలిసి వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేస్తున్న రంగసముద్రం, రాపూరివాండ్ల పల్లె, పీటీఎం కేంద్రాలను ఆమె పరిశీలించారు. మండలానికి వచ్చిన విత్తన కాయల వివరాలు, రిజిస్ట్రేషన్‌ తీరును, రైతులకు వేరుశనగ విత్తన కాయలు అందే విషయమై నేరుగా ఆమె రైతులనే అడిగి తెలుసుకున్నారు.

Updated Date - May 30 , 2024 | 11:16 PM