Share News

పులివెందుల మెడికల్‌ కళాశాలను ప్రారంభించాలి

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:35 AM

పులివెందులలోని వైద్య కళాశాలను వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం 150 సీట్లతో అయినా ప్రారంభించాలని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి కోరారు.

పులివెందుల మెడికల్‌ కళాశాలను ప్రారంభించాలి
శాసన మండలిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

వేంపల్లె, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పులివెందులలోని వైద్య కళాశాలను వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం 150 సీట్లతో అయినా ప్రారంభించాలని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి కోరారు. శా సన మండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ పులివెందులలో వైసీపీ ప్రభు త్వం మెడికల్‌ కళాశాలను నిర్మించిందని, అక్కడ 50శాతం మాత్రమే ఫ్యాకల్టీని ఏర్పాటు చేశారని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేని కారణంగానే 50 మెడికల్‌ సీట్లు మాత్రమే కేటాయంచారని తెలిపారు. ఆ సీట్లతో కళాశాలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతోనే ప్రారంభం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వం టీడీపీపై నిందలు వేయడం దురదృష్టకరమని, ఈ ప్రాంతంలో మెడికల్‌ కళాశాల అవసరమనేది టీడీపీ కృతనిశ్చయంతో ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కళాశాల ప్రారంభమయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మండలి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. భూముల సర్వే పేరుతో గత ప్రభుత్వం నిధులను దోచుకుందని, రీసర్వే ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడ్డారని సభ దృష్టికి తెచ్చారు. పాత సర్వే సర్వేనెంబర్లతో ఉన్న విధంగానే రికార్డులను పునరుద్ధరించాలని కోరారు. ఇప్పటికీ కొం దరు అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని, గండిలో గతంలో పనిచేసిన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉత్సవాల సందర్భంగా ఆహ్వానపత్రికలో ఎమ్మెల్సీ పేరు లేకుండానే చేశారన్నారు. అడిగినా అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్సీ కదా అనే ధోరణితో మాట్లాడారని గుర్తుచేశారు. ఇటీవల కడప రిమ్స్‌లో జరిగిన మంత్రి సమావేశానికి ఎమ్మెల్సీగా తన ను గాని, లోకల్‌ ఎమ్మెల్యేని గాని ఎవరిని ఆహ్వానించలేదన్నారు. ఇలా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి అధికారుల్లో మారేలా సంబంధిత మంత్రులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 12:35 AM