Share News

ప్రజలు లేకుండానే ప్రజావేదిక నిర్వహణ..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:59 PM

పీలేరు సీఎల్‌ఆర్‌సీ కార్యాలయంలో గురువారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ఒక్కరంటే ఒక్కరు సాధారణ ప్రజలు, గ్రామీణులు హాజరు కాలేదు.

ప్రజలు లేకుండానే ప్రజావేదిక నిర్వహణ..!
సామాజిక తనిఖీ సభలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

ఫ రూ.36,500లు రికవరీ

ఫ రికార్డులు ఇవ్వనందుకు

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు నోటీసులు

ఫ పీలేరులో తూతూమంత్రంగా సామాజిక తనిఖీ

పీలేరు, జనవరి 11: పీలేరు సీఎల్‌ఆర్‌సీ కార్యాలయంలో గురువారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ఒక్కరంటే ఒక్కరు సాధారణ ప్రజలు, గ్రామీణులు హాజరు కాలేదు. సభలో ఏర్పాటు చేసి న కుర్చీల్లో పీలేరు మండలంలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందే సరిపో యారు. వారి సమక్షంలోనే అధికారులు రికార్డులు, తనిఖీ సిబ్బంది నివేదికల పరిశీలన పూర్తి చేసి సామాజిక తనిఖీ ప్రక్రియను మమ అనిపించారు. ఇక ఎక్కడా లోపాలు ఎత్తిచూపకపోతే ఉన్నతాధికారుల కు, ప్రజలకు అనుమానం వస్తుందనుకున్నారో ఏమో, రూ.8.13 కోట్ల పనుల్లో రూ.36,500ల రికవరీకి ఆదేశించారు. పీలేరు మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో 2022 ఏప్రిల్‌1 నుంచి 2023 మార్చి 31 మధ్యలో రూ.8,13,36,954లతో 3425 పనులు చేపట్టారు. వాటిలో ఉపా ధి హామీ పథకం ద్వారా రూ.6,25,95,114లతో జగనన్న ఇళ్లతోపాటు నీటి సంరక్షణ పనులు, ఉద్యాన పంటలు వంటి 3407 పనులు చేపట్టా రు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.1,86,59,624లతో 17 పనులు, సమగ్ర శిక్ష పథకంలో రూ.82,216ల తో ఒక పని చేశారు. వాటిని పరిశీలించడానికి సామాజిక తనిఖీ జవా బుదారీతనం, పారదర్శకత సంస్థ(ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ)లోని ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీలు గత ఏడాది డిసెంబరు 24 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఆయా పనులను తనిఖీ చేశారు. వారి తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు, లోపాలను ప్రజల ముందు పెట్టి సమీక్షించేందుకు బుధవారం పీలేరు సీఎల్‌ఆర్‌సీ కార్యాలయంలో సామాజిక తనిఖీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు డ్వామా పీడీ మద్దిలేటి, ఉపాధి హామీ పథకం అంబుడ్స్‌మెన శివప్రసాద్‌, విజిలెన్స ఆఫీసర్‌ ప్రకాశ, పీలేరు ఎంపీడీవో డా.మురళీమోహన రెడ్డి, ఏపీడీ నందకుమా ర్‌ రెడ్డి హాజరయ్యారు. రూ.8.13 కోట్ల పనులకు జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సభలో అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు రూ.36,500ల రికవరీకి ఆదేశించారు. అదీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు చేసిన అకౌంటింగ్‌ తప్పి దాలకు. ఆ తరువాత మండలంలోని దొడ్డిపల్లె, ముడుపులవేముల సచివాలయాల భవనాలకు సంబంధించిన రికార్డులు సకాలంలో అం దించనందుకు ఆయా పంచాయతీల ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు నోటీసు లు జారీ చేశారు. అంతకు మించి అధికారులకు ఎటువంటి తప్పిదాలు కనిపించలేదు. సామాజిక తనిఖీ సభకు గ్రామాల నుంచి ఎవరూ రాకుండా ఉండేందుకు అటు అధికార పార్టీ నేతలు, ఇటు ఉపాధి హామీ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. జగనన్న కాలనీ ఇళ్లకు చెల్లిస్తున్న బిల్లులు మినహా మిగితా పనులన్నీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే చేసుకున్నారని, గ్రామస్థాయిలో సమావే శాలు జరిగినప్పుడే అక్రమాలు బయటకు పొక్కకుండా ఎక్కడిక్కడ కట్టడి చేసేశారని, ఇక సామాజిక తనిఖీ సభకు వెళ్లి అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండదని చాలా మంది గ్రామస్థులు సభకు రావడానికి అనాసక్తి చూపినట్లు తెలిసింది. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేసేటప్పుడు చూసీచూడనట్లు పోవాలని తనిఖీల కోసం వచ్చిన సిబ్బందికి కూడా స్థానిక అధికారులు చేతులు తడిపినట్లు సమాచారం. దీంతో ప్రజల సమక్షంలో జరగాల్సిన ప్రజావేదిక అంతర్గత సమీక్ష సమావేశంగా ముగిసిందని పలువురు వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 11 , 2024 | 11:59 PM