Share News

పీటీఎం ‘ఆదర్శ’ పాఠశాల

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:11 AM

పీటీఎం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.

పీటీఎం ‘ఆదర్శ’ పాఠశాల
పీటీఎం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రచారం నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌ శివకుమారి

6వ తరగతి లో ప్రవేశానికిశానికి దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 31 దరఖాస్తులకు చివరి గడువు

పెద్దతిప్పసముద్రం మార్చి 27 : పీటీఎం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్‌ భాషపై పట్టు తప్పనిసరి. గత 14 సంవత్సరాల క్రితమే పూర్తి స్థాయి ఇంగ్లీష్‌ మీడియం బోధనలో ఏర్పాటు చేసిన మోడల్‌ స్కూల్‌లు నేడు అభివృధ్ది పథంలో నడుస్తోంది. ఈ పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవే శం పొందితే ఇంటర్‌ వరకు విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందించడంతో పాటు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న బోజన వసతి కల్పి స్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే బాలికలకు కార్పొ రేట్‌ తరహాలో హాస్టల్‌ వసతి ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం గ్రామీణాపేద విద్యార్థులకు వరంగా మారుతోంది. ఇక్కడ చదివిన విద్యార్థులు ఎంసెట్‌, నీట్‌, ట్రిపుల్‌ ఐటీలల్లో సీట్లు సాదిస్తూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఇంగ్లీష్‌ మీడియంతో సత్పలితాలను సాదిస్తున్న ఈ పాఠశాలల్లో అడ్మిషన పొందడం గగనం గా మారుతోంది. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లీష్‌ మీడియంలో ఈ స్థాయిలో విద్యను అభ్యసించడానికి ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఈ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి ఈనెల 31వ తేదీ వరకు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు ఓసీ, బీసీ విద్యార్థులు 2012 సెప్టెంబరు 1 వ తేదీ నుంచి 2014 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01/09/2010 సెప్టెంబ రు 1వ తేదీ నుంచి నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. సంబందిత జిల్లాలో ఏదేని ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ శాలలో 2022- 23, 2023- 24 విద్యా సంవత్సరంలో చదివి 2023 - 24 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ అర్హత కలిగి ఉండాలి. పరీక్ష పీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 75, ఓసీ, బీసీ విద్యార్థులకు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంద న్నారు. 5వ తరగతి స్థాయిలో అబ్జెక్టికల్‌ విధానంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో ఓసీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 కనీస మార్కులుగా నిర్ణయించారు. పరీక్షలు ఏప్రిల్‌ 21న ఉద యం 10 గంటల నుంచి జరుగుతాయి.

ఆహ్లాదకర వాతావరణం: పాఠశాలలో ఆరు నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లీష్‌ మీడియంలోనే విద్యాభోదన, విశాలమైన తరగతి గదులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. గ్రంఽథాలయం, ఆధునిక సౌకర్యాలు, పరికరాలతో కూడిన సైన్సల్యాబ్‌లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌తో విద్యాబోధన, డిజిటల్‌ విద్యాబోధనకు అవకాశం ఉంది. 9వ తరగతి నుంచి అకడమిక్‌ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్‌ కోర్సులు ఆదర్శ పాఠశాల ప్రత్యేకం. ఇప్పటికే పాఠశా లలో ప్రవేశాల కోసం పాఠశాల ప్రిన్సిపాల్‌ శివకుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం కల్పిస్తున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:11 AM