Share News

హార్సిలీహిల్స్‌లో ప్రభుత్వ భూములను కాపాడాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:45 PM

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో ప్రభుత్వ భూములు, భవనాలు ప్రైవేటీకరణ మా నుకుని హిల్స్‌ను అన్ని విధాలా అభివృద్ది చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు.

హార్సిలీహిల్స్‌లో ప్రభుత్వ భూములను కాపాడాలి
జేసీకి వినతి పత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఫ జేసీ ఫర్మాన అహమ్మద్‌ఖానకు ఏఐటీయూసీ నేతల వినతి

మదనపల్లె, మార్చి1: ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో ప్రభుత్వ భూములు, భవనాలు ప్రైవేటీకరణ మా నుకుని హిల్స్‌ను అన్ని విధాలా అభివృద్ది చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. ‘పేదల ఊటీ..ఆస్తుల లూటీ’ పేరుతో గురు వారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడిన నేపథ్యంలో ఏఐటీయూసీ నేతలు జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లి జేసీ ఫర్మాన అహమ్మద్‌ఖానను కలిసి వినతి పత్రం అంద జేశారు. హిల్స్‌లో విలువైన ప్రభుత్వ భూములు, భవనాలు ప్రైవేటు పరం చేస్తున్నారని, భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని అరికట్టాలని వినతి పత్రంలో పేర్కొ న్నారు. అక్కడ విలువైన ఆస్థులను ప్రైవేటు పరం చేస్తూ, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. హార్సిలీహిల్స్‌లో అక్రమంగా జరిగిన లీజులను రద్దు చేయా లని ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతోపాటు పర్యాటలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అభివృద్ది చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి గంగాధర్‌, కోశాధికారి సలీంబాషా, ఉపా ధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సికింధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:45 PM