Share News

కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి చర్యలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:06 PM

కేంద్రీయ విద్యా లయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంస్థ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ తెలిపారు.

కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి చర్యలు
తాత్కాలిక భవనాలను పరిశీలిస్తున్న డిప్యూటీ కమిషనర్‌

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 7: కేంద్రీయ విద్యా లయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంస్థ డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ తెలిపారు. బుధవారం స్థానిక ట్రైబల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ పక్కన నిర్మించిన తాత్కాలిక భవనాలను ఆర్డీవో హరిప్రసాద్‌తో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ హైస్కూల్‌ వెనుక వున్న ప్రభుత్వ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి మంజూరు చేశారన్నారు అక్కడ భవనాలు నిర్మించేంత వరకు ఈ భవనాల్లో ఈ తరగతులు ప్రారంభిస్తామన్నారు. వారం రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కేంద్రీయ విద్యా లయ ప్రిన్సిపాల్‌ అనూరాధ, పంచాయతీరాజ్‌ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో భానుప్రసాద్‌, ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొనన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:06 PM