‘మండిపల్లి’ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు..
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:04 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన వేయడానికి వచ్చిన వారిని అడ్డుకొని నామినేషన పత్రాలు చించి వేసి, ఎన్నికైన మీరు మా మంత్రిపై విమర్శలు చేయ డం హాస్యాస్పదంగా ఉందని జడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లు నరసారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీపీపై జడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లు నరసారెడ్డి ఆగ్రహం
సంబేపల్లె, జూలై 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన వేయడానికి వచ్చిన వారిని అడ్డుకొని నామినేషన పత్రాలు చించి వేసి, ఎన్నికైన మీరు మా మంత్రిపై విమర్శలు చేయ డం హాస్యాస్పదంగా ఉందని జడ్పీటీసీ మాజీ సభ్యుడు మల్లు నరసారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి మండల సమావేశానికి వస్తున్నారని తెలిసిన వెంటనే స్వాగతం పలకాల్సింది పోయి, విమర్శలు చేయడం ఎంపీపీకి మంచిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీకి మహిళలంటే ఎంతో గౌరవం అని వారిని ఏ మాత్రం కించపరిచిన, అవమానించినా సహించని ముఖ్యమంత్రి, మంత్రిపై ఎంపీపీ ఆవుల నాగశ్రీలక్ష్మి నిందలు వేయడం తగదన్నారు. మండల సమావేశాలకు తప్ప గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని మీరు గౌరవం గూర్చి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నీ ప్రాదేశిక నియోజక వర్గం ఓటర్లు ఏ విధంగా ఓటేశారో మీకు తెలియదా అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమల్లు భాస్కర్‌రెడ్డి, నూరెకరాల రంగారెడ్డి, టీడీపీ ప్రచార కార్యదర్శి సుబ్బరాజుయాదవ్, రంగారెడ్డి, యువగళం మండిపల్లి సిద్దారెడ్డి, రెడ్డిమల్లు బాబురెడ్డి, ఖాదర్‌బాషా, ఎస్టీ నాయకులు జయరాం, అఖండనాయక్, పలువురు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.