Share News

‘పింఛన్ల సొమ్మును పక్కదారి పట్టించారు’

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:23 PM

పింఛన్ల సొమ్మును పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై నిందలు మోపు తున్నాడని రాయచోటి మున్సిపా లిటీ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు సలావుద్దీన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌ బాషా, పారిశ్రామికవేత్తలు కోడి శ్రీనివాసులరెడ్డి, జాఫర్‌అలీఖాన్‌, సీనియర్‌ మైనార్టీ నేత గోల్డ్‌ అల్లాబకష్‌, ఎంహెచ్‌పీఎస్‌ నాయకులు సగీర్‌ డిమాండ్‌ చేశారు.

‘పింఛన్ల సొమ్మును పక్కదారి పట్టించారు’
మాట్లాడుతున్న పట్టణ టీడీపీ నేతలు

-రాయచోటిటౌన్‌, ఏప్రిల్‌2: పింఛన్ల సొమ్మును పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై నిందలు మోపు తున్నాడని రాయచోటి మున్సిపా లిటీ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు సలావుద్దీన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌ బాషా, పారిశ్రామికవేత్తలు కోడి శ్రీనివాసులరెడ్డి, జాఫర్‌అలీఖాన్‌, సీనియర్‌ మైనార్టీ నేత గోల్డ్‌ అల్లాబకష్‌, ఎంహెచ్‌పీఎస్‌ నాయకులు సగీర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఇవ్వాల్సిన సొమ్ము రూ.13 వేల కోట్లు మార్చి 16 నుంచి 30 తేదీ మధ్య ఎన్నికల కోడ్‌కు విరుద్దంగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడని ఆరోపించారు. పింఛన్లను సకాలంలో ఇండ్ల వద్దకే పంపిణీ చేయకపోతే సీఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. ముఖ్యమంత్రి జగన్‌ తన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల కమిషన్‌పైన, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పైన, తెలుగుదేశం పార్టీపైన దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. వలంటీర్లను వైసీపీ కార్యక్రమా లకు వాడుకుంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్‌కు గురిచేయడమే కాకుండా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కారకుడయ్యాడని ఆరోపించారు.. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవకు మాత్రమే అంకితమయ్యే వలంటీర్లను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి యఽథావిధిగా కొనసాగిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:23 PM