Share News

పెద్దిరెడ్డివి దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:02 PM

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

పెద్దిరెడ్డివి దిగజారుడు రాజకీయాలు
ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

జగన్‌ అరాచక పాలన

కూటమితో దేశాభివృద్ధి

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 13 : వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రైల్వేకోడూరులోని చిట్వేలి రోడ్డులో ఉన్న విజయ కన్వెన్షన్‌ హాలులో టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కుటిల రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పెట్టుకున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి మనస్కరించకనాలుగు మాసాల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, మూడున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడానికే బీజేపీలో చేరానన్నారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. జగన్‌ను తాను జైలుకు పంపించానని పెద్దిరెడ్డి ఆరోపించడం సబబు కాదన్నారు.. జగన్‌ను తాను జైలుకు పంపినట్లు వారి కుటుంబ సభ్యులు కూడా ఏనాడూ చెప్పలేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేశాడన్నారు. 2014లో దేశం ఆర్ధిక పరిస్థితి పదో స్థానంలో ఉండిందని, ప్రస్తుతం నరేంద్రమోదీ దానిని 5వ స్థానానికి తీసుకొచ్చారన్నారు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న 25వేల కోట్ల మందిని మధ్య తరగతి కుటుంబాలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేశవ్యాప్తంగా 370 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎ్‌స.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఇసుక, భూములు, లిక్కర్‌, మైనింగ్‌ దోచేశారని విమర్శించారు. రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. వై.ఎ్‌స.జగన్‌ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అప్పులు తీసుకొని వచ్చి ప్రజలపై రుద్దారన్నారు. మదనపల్లి, పీలేరు, కలికిరి తదితర ప్రాంతాల్లో పెద్దిరెడ్డి వర్గాలు, ఆయన కంపెనీలు అనుమతులు లేకుండా అతివేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ 100 కోట్ల జరిమానా విధించారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల అభివృదికి సుమారు 1000 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. సీఎం సహాయ నిధి కింద కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్ధిగా తాను పోటీలో ఉన్నానని ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. రైల్వేకోడూరు కూటమి బలపరిచిన జనసేన అభ్యర్ధి అరవ శ్రీధర్‌ను గెలిపించాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమిని గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్‌ మాట్లాడుతూ కూటమిక అనుకూల వాతావరణంఉందన్నారు. బూత్‌ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కన పెట్టి సైనికుల్లా ఎన్నికల్లో పనిచేయాలన్నారు. టీడీపీ సీనియర్‌ నాయకులు కస్తూరి విశ్వనాఽథనాయుడు మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. ఆయన రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్ధిగా ఉండటం హర్షణీయమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పనతల సురేష్‌ మాట్లాడుతూ కూటమి చప్పుడు కొరముట్ల ఇంటి వరకు వినపడాలన్నారు. జనసేన మహిళా సర్పంచ్‌ కారుమంచి సంయుక్త మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటిత అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీనియర్‌ మైనారిటీ నాయకులు బాబా సాహెబ్‌ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో మైనారిటీలకు ఎన్నో చేశారని జగన్‌ వచ్చిన తరువాత మైనారిటీలకు ఏమీ చేసింది లేదని విమర్శించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టడం, దోచుకోవడం, దాచుకోవడంతోనే ఐదేళ్లు సరిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు నాగోతు రమే్‌షనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీలు గెలవడం ఖాయమన్నారు. టీడీపీ రైల్వేకోడూరు పరిశీలకులు హేమాంబరధరావు మాట్లాడుతూ ఈ ఎన్నికలు అవినీతికి అభిృద్ధికి మధ్య జరుగుతున్నాయని ప్రజలు అవినీతి ప్రభుత్వాన్ని పారదోలేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ రాజంపేటలో మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్లను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు, అమెరికా తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్‌, టీడీపీ యువ నాయకులు ముక్కా సాయి వికా్‌సరెడ్డి, బత్తిన వేనుగోపాల్‌రెడ్డి, పోతురాజు నవీన్‌, నార్జాల హేమరాజ్‌, బొక్కసం చలపతి, కల్లా చలపతి, గునిపాటి కిరణ్‌, నాయుడోరి రమణ, కట్ట గుండయ్య నాయుడు, గుత్తి నరసింహ, కొమ్మశివ, అజయ్‌బాబు, కె.కె.చౌదరి, లారీ సుబ్బరాయుడు, రామాంజులు, ఎన్‌ఎ్‌సఆర్‌, హస్తిచంద్రరాజు, మహిళా నాయకురాలు అనిత దీప్తి, సుప్రజ, జనసేన పార్టీ నాయకులు పగడాల వెంకటేష్‌, పగడాల చంద్రశేఖర్‌, పగడాల అంజనీ కుమార్‌, ఉత్తరాది శివకుమార్‌, శ్రీరామ్‌ గణేష్‌, జోగినేని మణి, మాదాసు నరసింహులు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ గడ్డం చంగల్‌రాజు, వాకచర్ల సుబ్బారావు, కిసాన్‌ మోర్చ అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణవర్మ, జిల్లా నాయకులు పులపత్తూరు రామసుబ్బారెడ్డి, బాల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:04 PM