రికార్డుల దహనంలో పెద్దిరెడ్డి హస్తం ఉంది
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:32 PM
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రికార్డుల దహనంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు బయటపడు తోందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించా రు.

భూ ఆక్రమణలు బయటపడుతాయనే రికార్డులు కాల్చేశారు
తంబళ్లపల్లెలో రెండు వేల ఎకరాలకుపైగా భూ ఆక్రమణలు
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి
ములకలచెరువు, జూలై 28: మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రికార్డుల దహనంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు బయటపడు తోందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆరోపించా రు. ములకలచెరువులోని పార్టీ కార్యాలయం లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ భూ ఆక్రమణలు బయటపడుతాయని పెద్దిరెడ్డి మనుషులు కుట్రపూరితంగా రికార్డులు కాల్చేశారన్నారు. మదనపల్లె ఘటనకు సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ ప్రభుత్వం వదలదన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెండు వేలకుపైగా భూములను పెద్దిరెడ్డి కుటుంబం బినామీ, అనుచరుల పేర్లతో ఆక్రమించుకుందన్నారు. నియోజకవర్గంలోని భూ బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని భూ బాధితులు ముందుకొచ్చి వివరాలు అధికారులకు అందజేయాలన్నారు. ఎవరికైనా భయం ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో అక్రమంగా తరలించి నిల్వ చేసిన ఇసుకను కూటమి ప్రభుత్వం రాగానే సీజ్ చేయడం జరిగిందన్నారు. నియోజక వర్గంలో ఇప్పటి వరకు 60వేల టన్నులు ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇసుక నిల్వల విలువ రూ.24 కోట్లు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, నాయకులు శంకర్‌రెడ్డి, లోకనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.