Share News

అశ్వ వాహనంపై పట్టాభిరాముడి వైభవం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:32 PM

వాల్మీకిపురం పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవా లలో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై పురవీధుల్లో ప్రజలను కటాక్షించారు.

అశ్వ వాహనంపై పట్టాభిరాముడి వైభవం
అశ్వ వాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 19: వాల్మీకిపురం పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవా లలో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై పురవీధుల్లో ప్రజలను కటాక్షించారు. ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, తోమాలసేవలతో విశేష పూజలు జరిగాయి. భోగోత్సవ మూర్తులైన సీతారామలక్ష్మణులకు విశేష అలంకరణలతో తిరుచ్చిలో వేంచేపు చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనం తరం సాయంత్రం పట్టాభిరాముడికి ఊంజల్‌సేవ కన్నుల పండుగగా నిర్వహిం చారు. రాత్రికి అశ్వ వాహనంపై పట్టాభిరాముని విశేషాలంకరణలతో అధిష్టింప చేసి పురవీధులలో నిర్వహించిన నగరోత్సవం వైభవంగా సాగింది.ఈసందర్భంగా కోలాటలు, చెక్కభజనలు, మహిళల చలిపిండి దీపారాధనలు, టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమాలలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌,సూపరింటెండెంట్‌ వెంకటస్వామి,ఆగమ సలహాదారులు శ్రీనివా సాచార్యులు, ఆలయ అధికారులు కృష్ణమూర్తి,నాగరాజ్తు,అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, కృష్ణప్రసాద్‌, కృష్ణరాజు, భాషికాచార్యులు, రామ్‌గోపాల్‌ బృందం, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలలో నేడు...పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రికి హంస వాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం, ధ్వజాఅవరోహణ కార్యక్రమాలు జరగనున్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 11:32 PM