నల్లారి సోదరులను ఆదరించండి
ABN , Publish Date - May 11 , 2024 | 11:54 PM
అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసం అహర్నిశలు పాటుపడే నల్లారి సోదరులను ఆదరించాలని నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూజా రెడ్డి పీలేరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పీలేరు, మే 11: అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం కాకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసం అహర్నిశలు పాటుపడే నల్లారి సోదరులను ఆదరించాలని నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూజా రెడ్డి పీలేరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు, బండ్లవంక ప్రాంతాల్లో శనివారం ఆమె తన కోడలు నల్లారి షమా రెడ్డి, కూతురు వైష్ణవీలతో కలిసి నమూనా ఈవీంల ద్వారా ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా తన భర్త నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గాన్ని పాతికేళ్లు ముందుకు తీసుకెళ్లారన్నారు. వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా నియోజకవర్గం పాతికేళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. నియోజకవర్గంలో మళ్లీ అభివృద్ధి పనులు సాగాలంటే ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్నారు. కిశోర్ కుమార్ రెడ్డి కూతురు వైష్ణవి మాట్లాడుతూ తన తండ్రి తమతో గడిపిన సమయం కంటే నియోజకవర్గంలో గడిపిన సమయమే ఎక్కువని, ఆయన అహర్నిశలు పీలేరు అభివృద్ధి కోసం తప న పడేవారన్నారు. అభివృద్ధి కోసం తపన పడేవారిని ఆదరిస్తే నియోజకవర్గంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అనంతరం వారు నమూనా ఈవీఎంలతో ప్రచారం నిర్వ హించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పురం రామ్మూర్తి, మల్లెల రెడ్డిబాషా, ఆంజి, వెంకట రత్నం, పురం రెడ్డమ్మ, లక్ష్మీకాంతమ్మ, వాణి, షమ, చందన, సూరి, జెమిని, శేఖర, బీజేపీ నాయ కులు చంద్రశేఖర రెడ్డి, వెంకటరమణ, పీఎం ఖాన, సుధారాణి, మహదేవనాయుడు, పాల్గొన్నారు.
నల్లగంగమ్మకు బీసీ నాయకుల పూజలు
పీలేరు, మే 11: నల్లారి సోదరుల విజ యం కోసం పీలేరు-తిరుపతి మార్గంలో ని నల్లగంగమ్మ ఆలయంలో శనివారం బీసీ హక్కుల పోరాట సమితి నాయకు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీ మణి నల్లారి తనూజా రెడ్డి, కోడలు నల్లారి షమారెడ్డి, కూతురు వైష్ణవి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడె రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తే చట్టసభల్లో రాష్ట్రంలోని బీసీల గొంతుకలవుతారన్నారు. రాజంపేట పార్లమెంటు సెగ్మెంటు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని బీసీలు నల్లారి సోదరులను ఆదరించి, తమ బంధువులు, స్నేహితుల ఓట్లు కూడా వేయించి మం చి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నల్లారి సోదరుల విజయం కోసం 1116 కొబ్బరి కాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎద్దుల మహేశ, పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు చింతగింజల అశోక్ కుమార్, నాయకులు సుధారాణి, శ్రీకాంత, శివ, భాను, తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలంతా నల్లారి కిశోర్‌కు మార్‌రెడ్డి వెంటే ఉన్నారని వాల్మీకిపురం మండలం చింతపర్తి సర్పంచ మహితా రెడ్డి పేర్కొన్నారు. శనివారం గ్రామ పం చాయతీలోని చారావాండ్లపల్లె, మద్దెల చెరువుపల్లె, చింతపర్తి తదితర ప్రాంతా లలో ముమ్మర ప్రచారం నిర్వహించా రు. ఈసందర్భంగా డమ్మీ ఓటింగ్ ఈవీ ఎంలతో ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి సైకిల్ గుర్తు, ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు జయచంద్రారెడ్డి, శేషాద్రిరెడ్డి, మద్దెల గిరిబాబు, మోహ న, మహేష్, రాజేష్, రమేష్, శివ, మురళి, శంకర, కిరణ్, సురేష్, బాలకృష్ణ, భరత, నాగార్జున, చిరంజీవి, సంతోష్, వంశీ, గణేష్, మల్లి, రాము, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.