Share News

బస్టాండ్‌లేక ప్రయాణికుల ఇక్కట్లు

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:25 PM

మం డల కేంద్రమైన పెద్దమండ్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

బస్టాండ్‌లేక ప్రయాణికుల ఇక్కట్లు
పెద్దమండ్యంలో ఆగిన బస్టాండ్‌ నిర్మాణం ఆర్టీసీ బస్సు రాగానే ఎక్కడానికి ప్రయాణికుల పాట్లు

పెద్దమండ్యంలో ఆగిన ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణం బస్సుల కోసం రోడ్లపైనా, దుకాణాల వద్ద గంటల తరబడి అవస్థలు పడుతున్న జనం

పెద్దమండ్యం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):మం డల కేంద్రమైన పెద్దమండ్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం జనం రోడ్లపైన, దుకాణాల వద్ద గంటలతరబడి వేచిచూస్తూ కాలంగడపాల్సి న దుస్థితి ఏర్పడుతోంది. కాగా ఆర్టీసీకి ఆదా యం ఉన్న మార్గాలలో ప్రయాణికులకు సౌక ర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫల మయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యం గా మదనపల్లి- తిరుపతి మార్గంలో మదనపల్లి ఆర్టీసీకి వస్తున్న కలెక్షనల తరవాత మదనపల్లి -గాలివీడు మార్గంలో ఆదాయం వస్తున్నాయి. ఈ మార్గంలో పలు చోట్ల ఆర్టీసీ బస్టాండ్‌లు లేక నిలుచొన్న చోటే బస్టాండ్‌ అని చెప్పుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన పెద్దమండ్యంకు మదనపల్లి - గాలివీడు వయా అంగళ్లు, గుర్రంకొండ, కలిచెర్ల, పెద్దమండ్యం మీదుగా గాలివీడుకు చేరుతుంది. కాగా పెద్దమండ్యం నుంచి మదనపల్లి, తం బళ్లప ల్లి, రాయచోటి, తిరుపతి, గాలివీడు వివిద ప్రాం తాల్లో బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు పెద్ద మం డ్యం బస్టాఫ్‌లో బస్సుల కోసం గంటల తరబడి వేచి వుండాల్సిందే. ఆ ప్రాంతంలో ఉన్న దుకాణా ల్లో వారి అనుమతితో కొద్ది సేపు ప్రయా ణికులు కూర్చునే అవకాశం ఉంది. అత్యవసర సమాయా ల్లో ప్రయాణికులు బస్టాండ్‌లేని కారణంగా బాత రూంలు లేక మహిళలు, వృద్ధులు పిల్లలు, నానా అవస్థలు పడుతున్నారు. వర్షకాలం, వేసవి ఎండ లకు దశాబ్దాలుగా పెద్దమండ్యం ప్రయాణికులు కష్టాలు పడుతూనే ఉన్నారు. ప్రజాప్రతి నిధుల కు, ఆర్టీసీ అధికారులకు ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని విన్నవించినా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఈ మార్గంలో ప్రయా ణిల ద్వారా ఆర్టీసీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని కానీ ప్రయాణిలకు సౌకర్యాలు కల్సిం చడంలో అధికారులు విఫలమయ్యారని పలువు రు వాపోతున్నారు. రెండేళ్ల క్రితం పెద్దమండ్యం బస్టాండ్‌ నిర్మాణం కోసం పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ. 15 లక్షలు, మండలంలోని కలిచెర్ల బస్టాండ్‌ నిర్మాణం కోసం రూ. 15 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. పెద్దమండ్యం బస్టాఫ్‌ పక్కనే సంవత్సర క్రితం చేపట్టిన బస్టాండ్‌ నిర్మా ణం పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. అలాగే కలిచెర్లలో బస్టాండ్‌ నిర్మా ణ పనులు చేపట్టలేదు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని పెద్దమండ్యం బస్టాండ్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రయాణిలు కష్టాలు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

నిధులు లేక పనులు ఆగాయి

పెద్దమండ్యం బస్టాండ్‌ అభివృద్ధి పనులు నిధులు లేక మందుకుసాగలేదు. కలిచెర్లలో బస్టాండ్‌ నిర్మాణానికి నిధులున్న స్థలం ఎంపిక చేయడంలో జాప్యం జరిగింది. నిధులు మంజూరైన వెంటనే పెద్దమండ్యం బస్టాండ్‌ నిర్మాణ అభివృద్ధి పనులు చేపడతాం.

-షేక్‌ షానవాజ్‌, ఇనచార్జ్‌ పీఆర్‌ ఏఈ, పెద్దమండ్యం మండలం

Updated Date - Nov 28 , 2024 | 11:25 PM