Share News

పండుటాకుల పడిగాపులు...

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:45 PM

గ్రామ సచివాలయాల వద్ద బుధవారం పింఛన్లు పంపిణీ చేస్తారనే సమా చారంతో అన్ని సచివాలయాల వద్ద పింఛనుదార్లు పడిగాపులు కాశారు. పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లో జమ కాకపోవడంతో సాయంకాల వరకూ పంపిణీ మొదలు కాలేదు.

పండుటాకుల పడిగాపులు...
కలికిరి: పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్న ఎంపీడీవో రామకృష్ణ

ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, పింఛన్ల కోసం నిల్వ చేసిన రూ.2 వేల కోట్ల నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేయడం, బుధవారం సాయంత్రానికిగానీ ఆ నిధులను సమకూర్చుకోలేకపోవడంతోనే పింఛన్ల పంపిణీ ఆలస్యమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకులకు సెలవుల కారణంగా నిధులు విడుదల చేయడంలో ఆలస్యం జరిగిందని ప్రభుత్వం చెపుతున్నా అది కూడా వాస్తవం కాదని, 30వ తేదీన బాంకులు పూర్తి స్థాయిలో పనిచేశాయని, ఆ రోజే నిధులు విడుదల చేసుంటే ఈ నెల 1వ తేదీనే పింఛన్ల పంపిణీ జరిగేదని కూడా పలువురు చెపుతున్నారు.

కలికిరి, ఏప్రిల్‌ 3: గ్రామ సచివాలయాల వద్ద బుధవారం పింఛన్లు పంపిణీ చేస్తారనే సమా చారంతో అన్ని సచివాలయాల వద్ద పింఛనుదార్లు పడిగాపులు కాశారు. పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లో జమ కాకపోవడంతో సాయంకాల వరకూ పంపిణీ మొదలు కాలేదు. సాయంకాలం నాలుగు గంట లకు సొమ్ము చేతికందగానే సచివాలయ సిబ్బంది పంపిణీ మొదలు పెట్టారు. ఒక్కో పింఛను పంపిణీకి రెండు నుంచి నాలుగు నిముషాలు సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది చెపుతున్నారు. గురువారం ఉదయం నుంచి పంపి ణీ ప్రారంభిస్తే సాయంకాలానికి పంపిణీ పూర్తయి పోతుందని కూడా అంటున్నారు.

మండలంలో 7185 మంది పింఛనుదారులుండగా. 14 సచివాలయాల నుంచి కనీసం 140 మంది ని పంపిణీకి కేటాయించినా ఒక్కొక్కరు సగటున 50 పింఛన్లు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా వేసవి తీవ్రత కారణంగా గ్రామాల నుంచి సచివాలయానికి వచ్చి పింఛన్లు తీసుకో వడానికి వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇళ్ళ వద్దనే పింఛన్లు పంపిణీ చేయించాలని పలువురు టీడీపీ నాయకులు కూడా డిమాండు చేస్తున్నారు. నాలుగేళ్ళుగా ఇళ్ళ వద్దనే పంపిణీ చేసి ఇప్పుడు ఇలా తిప్పుకోవడం వృద్ధులను ఇబ్బంది పెట్టడమే నని కూడా వీరు విమర్శిస్తున్నారు. కాగా, మండ లంలోని 14 సచివాలయాల్లో బుధవారం సాయం కాలం నాలుగు గంటలకు పంపిణీని ప్రారంభిం చగా రాత్రి 7 గంటలకు 25 శాతం పైగా పంపిణీ జరిగినట్లు ఎంపీడీవో రామకృష్ణ చెప్పారు. మొత్తం 7,186 పింఛన్లు పంపిణీ చేయాల్సి వుందని ఇందులో దాదాపు 1800 పింఛన్ల పంపిణీ పూర్తి చేపినట్లు వివరించారు. అన్ని సచివాలయాల్లోనూ అందుబాటులో వున్న సిబ్బంది అందరినీ పింఛన్ల పంపిణీకి పురమాయించినట్లు ఆయన తెలిపారు.

వృద్ధులు, వికలాంగుల ఇక్కట్లు

వాల్మీకిపురం: మండలంలో 14 గ్రామ సచివాల యాలుండగా 6034 మంది పింఛన్‌దారులున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గ్రామ వలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా, బుధవారం గ్రామ సచివాలయాల వద్ద పంపిణీ చేయను న్నారనే సమాచారం మేరకు ఉదయం 7 గంటలకే అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటలు కావస్తున్నా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వృద్దులు, వికలాంగులు ఇబ్బందు లు పడ్డారు. తిండీతిప్పలు లేకుండా మండుటెండ లో చెట్లకింద అవస్థలు పడ్డారు. ఈ విషయమై ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నా నికి నగదు డ్రా చేసి పంపిణీ చేస్తామన్నారు. అర ుుతే మధ్యాహ్నం 3గంటలు దాటినా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో పలువురు వృద్ధులు నిరాశగా వెనుదిరిగారు. చివరికి 5 గం టల తర్వాత పంపిణీ ప్రారంభించారు

బి కొత్తకోట: మండలంలో 6475 మంది పింఛన్‌ దారులు ఉండగా వారంతా సచివాలయాల వద్ద సాయంత్రం దాకా ఎదరుచూశారు. ఓపిక ఉన్నవాళ్లు అక్కడే వేచివుండగా, లేనివాళ్లు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు హడావుడిగా ఒకరిద్దరికి పింఛన్‌ సొమ్ము అందజేసి మమ అనిపించారు. దూరప్రాంతాల నుంచి పింఛను కోసం కాళ్లీడ్చుకుంటూ సచివాలయాల వద్దకు వచ్చిన వృధ్దులు, వికలాంగులు తిండి,తిప్పలు లేక అలమటించారు. పింఛను సొమ్ము రూ.2.40 కోట్ల పైచిలుకు మొత్తం చేతికి వచ్చిందని గురువారం నుంచి పంపిణీ వేగవంతం చేసి, పూర్తి చేస్తామని ఎంపీడీవో నూర్జహాన్‌ తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 10:45 PM