Share News

ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతి

ABN , Publish Date - May 31 , 2024 | 10:47 PM

కౌంటింగ్‌ రోజు ఏజెంట్లకు తప్ప మిగిలిన వారికి అనుమతి లేదని, ఇతరులెవ్వరూ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు రావద్దని లక్కిరెడ్డిపల్లె సీఐ జీవన గంగనాధ్‌ బాబు సూచించారు.

ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్‌  హాల్‌లోకి అనుమతి
గాలివీడు: రాజకీయనాయకుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ జీవనగంగాధర్‌బాబు

గాలివీడు, మే31: కౌంటింగ్‌ రోజు ఏజెంట్లకు తప్ప మిగిలిన వారికి అనుమతి లేదని, ఇతరులెవ్వరూ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు రావద్దని లక్కిరెడ్డిపల్లె సీఐ జీవన గంగనాధ్‌ బాబు సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఐ వెంకటప్రసాద్‌తో కలిసి గాలివీడు పోలీస్‌ స్టేషనలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన 4వ తేదీ ఎన్నికల ఫలితాల సందర్భంగా రాయచోటి పట్టణంలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన అమలులో ఉంటుందని, అనవసరంగా అక్కడికి వచ్చి ఇబ్బందులకు గురికావద్దన్నారు. ఎన్నికల ఫలి తాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తుకు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ పార్థసారఽథిరెడ్డి, టీడీపీ నాయకులు రవీంద్రబాబు, మహమ్మద్‌ రియాజ్‌, మహమ్మద్‌రఫీ, మిట్టపల్లి వెంకట్ర మణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పుల్లంపేట: ఫలితాల అనంతరం ర్యాలీలు, ఊరేగింపులు చేయకూడదని ఎన్నికల డీఎస్‌పి బాపూజీ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్టేషనలో అన్ని పార్టీల నాయకు లతో సమావేశం నిర్వహించారు. జూన 1 నుంచి సెక్షన 39, 144 సెక్షన అమల్లో వుంటాయన్నారు. ఎక్కడ కూడా నలుగురు గుంపులుగా ఉండకూడదన్నారు. బాణాసంచా పేల్చకూడదన్నారు.గ్రామాల్లో గొడవలు జరగ కుండా ప్రశాంతంగా వుండాలన్నారు.

సిద్దవటం : మండలంలోని సిద్దవటం, భాకరాపేట గ్రామాలలో శుక్రవారం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్‌ఐ పెద్దఓబన్న గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ఎటువంటి గొడవలు పడకుండా ఉండాల న్నారు. ఘర్షణలకు దిగితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సిద్దవటం పోలీసులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:47 PM