Share News

తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన ఎన్టీఆర్‌

ABN , Publish Date - May 29 , 2024 | 12:01 AM

తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత దివంగత ముఖ్యమంత్రి నందమూరి రామారావు అని మదనపల్లె ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహానబాషా పేర్కొన్నా రు.

తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన ఎన్టీఆర్‌
్ఠమదనపల్లెలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కూటమి అభ్యర్థి షాజహానబాషా పీలేరులో ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ శ్రేణులు

మదనపల్లె టౌన, మే 28: తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత దివంగత ముఖ్యమంత్రి నందమూరి రామారావు అని మదనపల్లె ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహానబాషా పేర్కొన్నా రు. మంగళవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101 జయంతి వేడు కలను మదనపల్లెలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బెంగళూరు బస్టాండు వద్ద టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళుల ర్పించి, కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా షాజహానబాషా మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలో వచ్చిన ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. పేద లు, బడుగులు, బలహీనులు అన్ని విధాలుగా ఎదిగేందుకు ఎన్టీ రా మారావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అనంతరం దేవతానగర్‌లోని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ కార్యాలయంలో ఎన్టీ ఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ అనుబంఽ ద విభాగాల నాయకులు మోడెం సిద్దప్ప, ఎస్‌ఏ మస్తాన, ఎస్‌ఎం రఫి, నీలకంఠ, గుత్తికొండ త్యాగరాజు, టౌనబ్యాంకు మాజీ చైర్మన విద్యాసాగర్‌, ఆర్‌కే రామకృష్ణాచారి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాగార్జునబా బు, రాటకొండ మధుబాబు, షంషీర్‌, నాగూర్‌వలి, పఠానఖాదర్‌ఖాన, ఎస్‌.సుధాకర్‌, పూల మురళి, కత్తి లక్ష్మన్న, జేవీ రమణ, పెంచుపాడు స్వామి, ప్రభాకర్‌, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు. స్థానిక అన్నమయ్యసర్కిల్‌ వద్ద టీడీపీ కార్యాలయంలో యువనేత దొమ్మలపాటి యశశ్విరాజ్‌, సీనియర్‌ టీడీపీ నేత డీఆర్‌ తులసిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు చిత్రప టానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీటీఎం గ్రామంలో మాజీ సర్పంచ ప్రభాకర్‌రెడ్డి, చల్లా నరసింహులు, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్య క్షుడు దేవరింటి శ్రీనివాసులు, కత్తి అరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: తెలుగజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయు డు స్వర్గీయ ఎనటి రామారావు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం బి.కొత్తకోట జ్యోతిసర్కిల్‌ లో తెలుదేశంపార్టీ వ్యవస్థాపకుడు ఎనటీఆర్‌ 101వ జయంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమా లలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు నారాయణస్వామిరెడ్డి, కుడుంశ్రీనివాసులు, బంగారువెంకట్రమణ, కనకంటి ప్రసాద్‌, డేరిం గులనారాయణ, కనకం టిప్రసాద్‌, సుకుమార్‌, చావిడికిట్టన్న, గంజి మోహన, ఎండీ మస్తాన, సమీవుల్లా, చాకనారాజా, హుసేనఖాన, సురేంద్ర, రవికుమార్‌, ప్రభాకర్‌, శిల్పాఅంజి, బండిరమణ, సిద్దారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పద్మనాభ తదితరులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుక లను పీటీఎంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండు కూడలిలో టీడీపీ అభిమానులు, కూటమి నేతలు బారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, మొలకలచెరువు మాజీ మార్కెట్‌ చైర్మన ఓబు లేసు, సింగిల్‌ విండో మాజీ చైర్మన సంపతికోట కిట్టన్న, మాజీ ఎంపీ టీసీ చంద్రశేఖర్‌(చిన్నా), రంగసముద్రం ప్రభాకర్‌, మహబూబ్‌ బాషా, టైలర్‌ రామాంజీ, గ్రామకమిటీ అద్యక్షుడు కత్తి ఆదినారాయణ, కార్యం సుబ్రమణ్యం, భజంత్రి రామచంద్ర, అంకిరెడ్డిపల్లె రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేష్‌బాబు, గంగాద్రి, చిన్న రెడ్డెప్ప, రమణ పాల్గొన్నారు.

రామసముద్రంలో: దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవ స్థాపకుడు, నందమూర్తి తారకరామారావు 101వ జయంతి వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు ఆధ్వర్యంలో మంగళవా రం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూజలు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు, నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో మం డల తెలుగు యువత అధ్యక్షుడు ప్రశాంతరెడ్డి, చెంగారెడ్డి, బండ్ల జనా ర్దన, కృష్ణమూర్తి, ఇలియాజ్‌, డాక్టర్‌ శివ, వేణుగోపాల్‌, మాజీ సర్పంచ రెడ్డిశేఖర్‌, శ్రీనివాస్‌గౌడు, ఎల్‌.శివ, మొహ్మద్‌, చాంద్‌బాషా, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ములకలచెరువులో: తెలు గువారి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన యుగపురుషుడు ఎన్టీఆర్‌ అని తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాయంలో మంగళవారం ఎన్టీఆర్‌ 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూజలు చేపట్టి నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ను కట్‌ చేసి నాయకులు, కార్య కర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షులు పాలగిరి సిద్ధా, రెడ్డెప్పరెడ్డి, నియోజకవర్గ జనసేన పార్టీ ఇనచార్జి పోతుల సాయినాధ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు చెన్నకిష్టా, నేతలు ముత్తు కూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, మూగి రవిచంద్ర, నారాయణ స్వామి, వెంకటస్వామి, నాయకులు బాలాజీ, సుదర్శన, రెడ్డెప్ప, గాండ్ల రెడ్డెప్ప, నాగేంద్ర, రమణమూర్తి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

కురబలకోటలో:టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాజంపేట పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు సరేంద్రయాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు మల్లికా ర్జుననాయుడులు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సూరి కాంప్లెక్స్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌ 101 జయంతి వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనాథ్‌రెడ్డి, బాలకృష్ణ, తిమ్మరాయుడు, వెంకటరమణారెడ్డి, వైజీ సూరి, సురేంద్ర పాల్గొన్నారు.

గుర్రంకొండలో:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమం త్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను టీడీపీ నాయ కులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గుర్రంకొండ పార్టీ కార్యా లయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

కలకడలో:మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను మంగ ళవారం టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలకడ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పొత్తూరి ప్రభాకర్‌ నాయుడు, మద్దిపట్ల వెంకటరమణనాయుడు, మల్లికార్జుననాయుడు, చంద్రమోహన, త్యాగరాజు, చంద్రప్పనాయుడు, గురుస్వామి, బాలాజి గౌడ్‌, జనార్ధననాయుడు, రెడ్డెప్ప, జిలానీ, నౌషాద్‌, అలీ, ఇర్పానలు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమం త్రి నందమూర్తి తారకరామారావు తెలుగు జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికా ర్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ 101వ జయంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నాయ కులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అలాగే స్థానిక బైపాస్‌రోడ్డులోని ఆశ్రమంలో వృద్దులకు పండ్లు, రొట్టెల పంపి ణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాలలో పీలేరు పార్టీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, నాయకులు గాంధీపేట రమణ, సురేంద్రవర్మ, పీవీ నారాయణ, వల్లిగట్ల వెంకటరమణ, చంద్రమౌళి, రాజేంద్రాచారి, కువైట్‌ సయ్యద్‌బాషా, సుధాకర్‌రెడ్డి, ఎండీ యూసుఫ్‌, స్వర్ణలత, బొక్కసం రామకృష్ణ, ఆనంద్‌, డిష్‌ బ్రదర్స్‌, కోసూరి రమేష్‌, తుంబూరి రమణ, నాగేశ్వర్‌, రామచంద్ర, అబ్బాస్‌, సికిందర్‌, జయ, దండువారిపల్లె రమణ, సైదు, ఆదినారాయణ, రెడ్డిరామ్‌, షబ్బీరుల్లా ఖాన, అస్లాం, సయ్యద్‌అమీర్‌, గాంధీపేటరెడ్డి పాల్గొన్నారు.

పీలేరులో: స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని మంగళవారం పీలేరులోని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించి దానిని పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగంలో అనితర సాధ్య మైన విజయాలు సాధించిన ఎన్టీఆర్‌ అందరికీ ఆదర్శమన్నారు. అనం తరం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కోటపల్లె బాబు రెడ్డి, వారణాశి శ్రీకాంత రెడ్డి, పురం రామ్మూర్తి, పోలిశెట్టి సురేంద్ర, లక్ష్మీకర, వసంతాల రాజా, మల్లెల రెడ్డిబాషా, షౌకతఅలీ, రమాదేవి, చానబాషా, లడ్డూ జాఫర్‌, ముబా రక్‌, సుబ్రహ్మణ్యం, గాండ్ల విజయ కుమార్‌, శంకర, శేఖర, వెంకట రమణ నాయక్‌, జయన్న, ఆబిద్‌ అలీ, రెడ్డప్పరెడ్డి పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తెలుగు జాతి కీర్తి ప్రపంచానికి చాటిన మహనీయు డు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తంబళ్లపల్లె నియో జకవర్గ ప్రచార సమన్వయకర్త సీడ్‌ మల్లికార్జుననాయుడు పేర్కొ న్నారు. మంగళవారం తంబళ్లపల్లె టీడీపీ కారాల్యయంలో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయ కులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ చిత్రపటం ఏర్పాటు చేసి నివాళులర్పిం చారు. కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో బీసీ నాయకుడు తులసీధర్‌నాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చలపతి నాయుడు, మాజీ సర్పంచ లక్ష్మీనారాయణనాయుడు, నరసింహులు, వీరాంజినేయులు, శంకర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, సుబహాన పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: మండలంలోని పెద్దమండ్యం, సిద్దవరం గ్రామా ల్లోని టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ మండలాధ్యక్షుడు వెంకట్రమణ, మాజీ అధ్యక్షుడు సిద్దవరం ప్రసాద్‌, మండల బీజేపి అధ్యక్షుడు లక్ష్మీననారాయణ మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కలికిరిలో: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమాలను కలికిరిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అమరనాథ రెడ్డి భవన ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పేదలు ప్రధానంగా బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడని కొనియాడారు. మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమాల్లో సతీష్‌ రెడ్డి, అబ్దుల్‌ ఖాదర్‌, సహదేవ రెడ్డి, రహంతుల్లా, అఫ్రోజ్‌, జనార్ధన చిన్నరెడ్డెయ్య, వెంకటపతి, వర్మ, ఏసురాజు, మున్వర్‌, షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో: దివంగతనేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101జయంతి వేడుకలను మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా నాయకులు ఎన్టీఆర్‌ చిత్ర పఠానికి పూల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డెప్పరెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట రమణ, బీసీ సాధికారత సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మన్న, మాజీ జిల్లా కో-ఆప్షన సభ్యుడు సుధాకర్‌రావు, సర్పంచి రెడ్డెప్ప, మాజీ సర్పంచులు మల్లప్ప శ్రీరాములు, రమణ నాయకులు చెండ్రాయుడు, రామచంద్ర, శంకర, శ్రీపతి, సూర్యప్రకాష్‌, మురళి, మల్లికార్జున, కేశవ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:01 AM