నోటీసులా..? భయపడం
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:25 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయాల సిబ్బంది అంగన్వాడీ సెంటర్లకు వచ్చి నోటీసులు అతికించి వెళుతున్నారు. నోటీసులకు భయపడే ప్రసక్తేలేదని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తేల్చిచెప్పారు.

32 ఆకారంలో అంగన్వాడీల నిరసన
మోకాళ్లపై నిలబడి, లెంపలేసుకుంటూ, ఖాళీ చాటలో సరుకుల పేర్లతో నిరసన
బేడీలు వేయమని పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన
జమ్మలమడుగు, జనవరి 12: ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయాల సిబ్బంది అంగన్వాడీ సెంటర్లకు వచ్చి నోటీసులు అతికించి వెళుతున్నారు. నోటీసులకు భయపడే ప్రసక్తేలేదని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తేల్చిచెప్పారు. శుక్రవారం ఐసీడీఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు 32వరోజు నిరసనలో భాగంగా 32 ఆకారంలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, యూనియన్ నేతలు కోలాటం ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యేదాకా తాము ఎలాంటి బెదిరింపులకు భయపడమన్నారు. ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలను ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్లు చేసి విధులకు వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ సెంటర్ వద్ద నోటీసులు ఇస్తున్నారని బెదిరిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఇలాంటి బెదిరింపులు మానుకుని అంగన్వాడీలకు అధికారులు మద్ధతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. యూనియన్ నేతలు ప్రసాద్, ఓబులేసు, విజయ్, బాగ్యలక్ష్మి, లక్ష్మిదేవి, నరసమ్మ, సుబ్బలక్షుమ్మ, కుళాయమ్మ, సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.
మోకాళ్లపై నిలబడి నిరసన
కొండాపురం, జనవరి 12: అంగన్వాడీ కార్యకర్తలు కొండాపురంలో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. జీతాలు పెంచి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు తారాదేవి, పద్మ, వరలక్ష్మి పాల్గొన్నారు.
32 ఆకారంలో నిరసన...
మైదుకూరు, జనవరి 12: తమ సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందంటూ అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న సమ్మె శుక్రవారానికి 32వ రోజుకు చేరు కుంది. దీంతో వర్కర్లు, కార్యకర్తలు 32 ఆకారంలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె దీక్షలకు టీడీపీ, జనసేన, ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీక్షలో వరలక్ష్మి, నాగవేణి, వీరమ్మ, మరియమ్మ, సుబ్బలక్ష్మి, కూర్చున్నారు. భారతీ, చెన్నమ్మ, లక్ష్మిదేవి, గంగావతి, రామతులసి, రిజ్వ నా, అనురాధ, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
చాపాడులో....
చాపాడు, జనవరి 12: తహసీల్దారు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు ధర్నా కొనసాగిస్తామన్నారు.
ఎర్రగుంట్లలో....
ఎర్రగుంట్ల, జనవరి 12: ఉదయం నుంచి అంగన్వాడీలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నెల దాటినా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణ మని విమర్శించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఖాళీ చాటలో నిత్యావసర సరుకుల పేర్లతో....
పోరుమామిళ్ల, జనవరి 12: సీఐటీయూ ఆధ్వర్యంలో పోరు మామిళ్ల తహసీల్దారు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెలో ఖాళీ చాటలతో నిత్యావసర సరుకులు నిండుకున్నాయని నిరసన తెలిపారు. జిల్లా ఉపా ధ్యక్షుడు భైరవ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వా డీలు సమ్మె చేస్తుంటే సీఎం జగన్ నిరంకుశ వైఖరితో వ్యవ హరిస్తున్నారన్నారు. అంగన్వాడీ నాయకురాలు వినోదా దేవి, రేణుక, స్వాతి, జ్యోతమ్మ, విజయమ్మ, అంజనమ్మ, ఫాతి మా, శ్రీదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
లెంపలేసుకుని నిరసన...
బద్వేలు రూరల్, జనవరి 12: ఓట్లేసి అధికారంలోకి తెచ్చి తప్పు చేశాం జగనన్నా అంటూ అంగన్వాడీలు లెంప లేసు కుని నిరసన చేపట్టారు. సీఐటీయూ కార్యదర్శి శ్రీనివాసు లు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఖదీరయ్య, అంగ న్వాడీ నేతలు సుభాషిని, హుసేనమ్మ, సత్యవతి, కళావతి, రాధమ్మ, అరుణమ్మ పాల్గొన్నారు.
బేడీలు వేయమని పోలీసుస్టేషన్ వద్ద...
ప్రొద్దుటూరు ,జనవరి 12: మాకు బేడీలు వేయమని త్రీ టౌన్ పోలీసుస్టేష వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. శుక్రవారం తహసీల్దారు కార్యాలయం నుంచి త్రీటౌన్ వరకు ర్యాలీగా వెళ్లి బేడీలు వేయమని అంగన్ వాడీలు నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, వర్కర్స్ యూనియన్ నేతలు సుబ్బలక్ష్మీ రాణి గురుదేవి, శివమ్మ, కృష్ణ వేణి, విజయ పద్మ పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లకు నోటీసులు
బ్రహ్మంగారిమఠం, జనవరి 12: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను సచివాలయ సిబ్బంది ఇళ్లకు అంటిస్తున్నారు. ఈ నోటీసులు మా ఇళ్లకు ఎందుకు అంటిస్తున్నారని మీరేమైనా ఉంటే అంగన్వాడీ స్కూళ్లకు అంటించాలని అనడంతో ఇళ్లకు అంటించాలని ఉన్నతాధికారులు చెప్పా రని సమాధానం ఇచ్చారు. ముందుగా అంగన్వాడీ యూ నియన్ లీడర్ల ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. వా రం రోజుల్లో విధులకు హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఉన్నట్లు తెలిపారు.