విద్యుత లేక తాగునీటికి కటకటా..
ABN , Publish Date - May 10 , 2024 | 11:34 PM
విద్యుత ఫోల్‌పై చెట్టుకొమ్మపై పడడం తో రెండురోజులుగా తాగునీరు లేక రెండు రోజులుగా తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిమ్మనపల్లె పంచా యతి గూడుపల్లె గ్రామస్థులు వాపోయారు.
నిమ్మనపల్లి, మే 10: విద్యుత ఫోల్‌పై చెట్టుకొమ్మపై పడడం తో రెండురోజులుగా తాగునీరు లేక రెండు రోజులుగా తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిమ్మనపల్లె పంచా యతి గూడుపల్లె గ్రామస్థులు వాపోయారు. శుక్రవారం వారు మాట్లాడుతూ రెండురోజుల క్రితం జూనియర్ లైనమ్యాన మహమ్మద్ వానీష్ గ్రామానికి వచ్చి విద్యుత లైనపై ఉన్న కొమ్మలను తొలగించే క్రమంలో కత్తిరించిన కొమ్మ విద్యుత లైనపై పడడంతో ఫోల్ విరిగి పోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు విద్యుత సరఫరా లేక దాదాపు 60కుటుంబాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు 16 విద్యుత కనెక్షన కింద ఉన్న బోర్ మోటర్లు కూడా పని చేయట్లేదని తెలిపారు. అంతే కాకుండా వైర్లు కింద పడి వేలాడుతుండ డంతో గ్రామానికి దారి కూడా లేకుండా పపోయిందని గ్రామ స్థులు తెలిపారు. కరెంట్ రెండురోజులుగా లేదని విద్యుత అధికారులకు తెలిపినా సరైన సమాధానం లేదని తెలిపారు. దీనిపై సంబందిత జూనియర్ లైనమెన మహమ్మద్ వానీష్‌ను వివరణ కోరగా లైనలపై ఉన్న కొమ్మలను కొట్టే క్రమంలో విద్యుత స్థంభం మీద వాలిందని దాన్ని మార్చేం దుకు సమయం పడుతుందని సమాధానం ఇచ్చారు.