Share News

న్యూఇయర్‌ వేడుకలు

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:39 AM

నూతన సంవత్సర 2024 వేడుకలకు స్వాగతం పలుకు తూ మదనపల్లె, పీలేరు ప్రాం తాల్లో సంబరాలతో సందడి సం దడిగా జనం కేరింతలు కొట్టా రు.

న్యూఇయర్‌ వేడుకలు
ప్రదర్శనలో న్యూఇయర్‌ కేక్‌లు

మదనపల్లెఅర్బన, డిసెంబరు 31: నూతన సంవత్సర 2024 వేడుకలకు స్వాగతం పలుకు తూ మదనపల్లె, పీలేరు ప్రాం తాల్లో సంబరాలతో సందడి సం దడిగా జనం కేరింతలు కొట్టా రు. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వా గతం పలుకుతూ యువత కేరింతలతో వేడుకలు జరుపుకుంది. ఆదివారం సాయంత్రం నుంచే ఆయా ప్రాంతాల్లో కేకులను కొనుగోలు చేసి అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌లు కట్‌ చేసి న్యూఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. మదనపల్లె పట్టణంలో కేజీ నుంచి 10 కేజీల వరకు సాధారణ కేక్‌లు, కూల్‌ కేక్‌లు సిద్ధంచేయడంతో వాటి కొనుగోలుకు ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచి బేకరీలకు క్యూక ట్టారు. అలాగే బెంగూరు బస్టాండ్‌, చిత్తూరు బస్టాండ్‌ పరిసర ప్రాంతాలు పూలు, పండ్లు కొనుగోలే చేయడానికి జనం రావడంతో ఆప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. ఇక నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బర్మావీధిలోని షిర్డీ సాయిబాబ ఆలయం, నీరుగట్టువారిపల్లెలోని మం జునాథస్వామి ఆలయం, దేవళం వీధిలోని ప్రసన్న వేంకటరమణ స్వామి, వరాల ఆంజనేయ స్వామి ఆలయాలను నిర్వాహకులు ముస్తాబు చేశారు.

బి.కొత్తకోటలో: నూతన సంవత్సర వేడుకలు హార్సిలీ హిల్స్‌లో సంబరంగా జరుపుకున్నారు. పర్యాటకులు శనివారం నుంచే హార్సి లీహిల్స్‌కు చేరుకోవ డంతో వేడుకలకు రెండు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు పూర్తిచేసుకు న్నారు. కాగా వేడుకల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని మదన పల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ1న హిల్స్‌పైకి ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని, బహిరం గ ప్రదేశాల్లో మద్యం తాగడానికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. కొండపై సుమారు 50 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బి.కొత్తకోట తహసీల్దార్‌ రఫిక్‌ అహ్మద్‌, ట్రైనీ డీఎస్పీ ప్రశాంత, టూరి జం మేనేజర్‌ సాల్వీనరెడ్డి, వీఆర్‌వో నరేంద్ర, పంచాయతీ కార్యదర్శి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:39 AM