Share News

డెత్‌, డబుల్‌ ఎంట్రీలు తొలగించటంలో నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:16 PM

ఫైనల్‌ ఓటరు జాబితా జనవరి 22న ప్రచురితమైనా డెత్‌లు, డబుల్‌ ఎంట్రీలు తొలగించటంలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. మంగలవారం సాయంత్రం తహసీల్దారు కార్యాలయంలో ఎన్నికల పార్టీ ప్రతినిధులతో ఈఆర్‌వో సమావేశం జరిపారు.

డెత్‌, డబుల్‌ ఎంట్రీలు తొలగించటంలో నిర్లక్ష్యం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న ఈఆర్‌వో చంద్రమోహన్‌

సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల వాదన

ప్రొద్దుటూరు , ఫిబ్రవరి 6 : ఫైనల్‌ ఓటరు జాబితా జనవరి 22న ప్రచురితమైనా డెత్‌లు, డబుల్‌ ఎంట్రీలు తొలగించటంలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. మంగలవారం సాయంత్రం తహసీల్దారు కార్యాలయంలో ఎన్నికల పార్టీ ప్రతినిధులతో ఈఆర్‌వో సమావేశం జరిపారు. ఈసందర్బంగా వారు ఫైనల్‌ లిస్టు తరువాత కూడా ఫాం7 ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇంకా బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో వాటిని తొలగించే పనులు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమౌతోందని తెలిపారు. ఇందుకు ఈఆర్‌వో చంద్రమోహన్‌స్పందిస్తూ ఫాం7 కేవలం 1649పెండింగ్‌ వున్నాయన్నారు. అలాగే ఫాం 6, 958 ఫాం 8 , 951 పెండింగ్‌లో వున్నట్లు తెలిపారు. వీటిని వెంటనే క్లియర్‌చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంంలో తహసీల్దారు విద్యాసాగ్‌, కమిషనర్‌ మల్లికార్జున, ఎన్నికల డీటీ అజయ్‌బాబు, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:17 PM