Share News

పేర్లు అమోఘం.. సౌకర్యాలు శూన్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:33 PM

వాయల్పాడు..వాల్మీకిపురం.. ఇలా ఊరికి రెండు పేర్లు..పేర్లలో ఉన్న గొప్పతనం అభివృద్ధిలో లేదు.

పేర్లు అమోఘం.. సౌకర్యాలు శూన్యం
వాల్మీకిపురం గ్రామ పంచాయతీ కార్యాలయం సౌకర్యాల్లేని వాల్మీకిపురం గాంఽధీ బస్టాండు ప్రాంతం

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 24: వాయల్పాడు..వాల్మీకిపురం.. ఇలా ఊరికి రెండు పేర్లు..పేర్లలో ఉన్న గొప్పతనం అభివృద్ధిలో లేదు. బ్రిటీష్‌ కాలం నాటి నుం చి ఎంతో ప్రాశస్తి ఉన్న ఈ పట్టణం .ఒకప్పటి నియోజకవర్గం కేంద్రం, తరు వాత చోటుచేసుకున్న పరిణామాలు, పాలకుల స్వార్థాలూ ఇప్పటికీ ఆ ఊరి బాగోగులను పట్టించుకున్న నాదుడే లేడు.వాల్మీకిపురం పట్టణంలో ప్రస్తుతం సుమారుగా 30వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టు ఒక పార్కు, తదితర సౌకర్యాల కల్పన లేకపోవడం శోచనీయం. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఒకప్పుడు ఉండే పార్కు ప్రాంతం పూర్తిగా కనుమరుగైంది. సాధారణంగా గ్రామపంచాయతీలో అన్నీ పన్నులు వసూలు చేసే అధికార ఘనం వసతుల కల్పనలో అదే చొరవ చూపడంలేదన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. ఒకప్పటి బాపూజీ పార్కును సైతం కనుమరుగు చేశారు. దీంతో పట్టణంలో ఉదయం, సా యంత్రం కాలి నడకతో సేద తీరే పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారు. ఎప్పటికప్పుడు పన్నులతో ప్రజలను హెచ్చరించే పంచా యతీ అధికారులకు సమస్యలు కనపడటం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వాకింగ్‌ చేయాలంటే.. రైల్వే స్టేషనకు వెళ్లాల్సిందే..!

ప్రతి నిత్యం వాల్మీకిపురంలో విశ్రాంత ఉద్యోగులు, సీనియర్‌ సిటీజనలు, మహిళలు ఉదయం, సాయంత్రం నడక సాగించాలంటే ఎక్కడా ఆసరా లేక అందరూ స్థానిక రైల్వే స్టేషన చేరుకుని తమ నడక సాగించడం నిత్య కృత్యంగా మారింది. పట్టణంలో ఒకప్పటి గ్రామ పంచాయతీ పార్కు ప్రాంతం సచివాలయం, అనవసరపు కట్టడాలతో అక్రమణలకు గురికావడం ప్రజలు సైతం ప్రశ్నించే సందర్భం లేకుండాపోతోంది. బ్రిటీష్‌ కాలం నాటి నుంచి ఎంతో సౌకర్యంగా ఉండే గాంధీ బస్టాండు ప్రాంతం నిలువ నీడ లే దు. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో ప్రయా ణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండు ప్రాంతంలో గ్రామ చావిడి స్థలాలు ఉన్నా అధికారులకు సమస్యను విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని సర్వత్రా విమర్శలున్నాయి.

పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం

వాల్మీకిపురం పట్టణంలో గతంలో పార్కు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ భవన నిర్మాణాలు జరిగాయి. పట్టణ ప్రజలకు అనుకూలంగా, ఆహ్లాదంగా ఉండేలా నూతన పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఇందు కోసం స్థల పరిశీలన చేసి గతంలో కంటే మెరుగైన సౌకర్యాలతో పార్కు ఏర్పాటకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతాం. కాగా గతంలో పార్కు ఉన్న స్థలంలో ప్రజల సౌకర్యార్థం నీటి ట్యాంకు నిర్మాణాలు ఉన్నాయి. దీంతో అక్కడ పార్కు ఏర్పాటుకు స్థలం అనుకూలంగా లేదు.

-రెడ్డిప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి, వాల్మీకిపురం

ఊరికి గుర్తింపు లేదు..

వాల్మీకిపురం పేరు చెబితే ఒకప్పుడు ఎంతో గుర్తింపు. ప్రస్తుతం అది ఎక్క డా కనిపించడం లేదు. ఊరికి ఉన్న ఒకానొక్క పార్కు కూడా కనుమ రుగైంది. ప్రతి ఊరికి ఓ పార్కు లాంటి ప్రశాంత వాతావరణం ఉంటుంది. అది మా ఊరికి లేదనే బాధ జీర్ణించుకోలేం. అధికారులు, పాలకులు స్పందించాలి.

-ప్రభుచరణ్‌, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, వాల్మీకిపురం

కనీస సౌకర్యాలను కల్పించాలి

వాల్మీకిపురానికి మా తాతల నాటి నుంచి ఎంతో గుర్తింపు ఉంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. గాంధీ బస్టాండు ప్రాంతంలో ఈన్నీ సమస్యలే. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవు. బస్టాండు ప్రాంతంలో కనీసం మరుగు దొడ్లు లేక నిత్యం ఇబ్బందులే. ప్రభుత్వ స్థలాలు ఉన్నా అధికారులు గుర్తించి కనీస సౌకర్యాలను కల్పించాలి.

-రఘు, వ్యాపారి, వాల్మీకిపురం

Updated Date - Apr 24 , 2024 | 11:33 PM