Share News

సమ్మెలోకి మున్సిపల్‌ పారిశుద్ద్య కార్మికులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:33 PM

ముందుగా ప్రక టించినట్లే మున్సిపల్‌ పారిశుద్ద్య కార్మి కులు బుధవారం సమ్మె బాటపట్టారు. విధులు బహిష్కరించిన కాంట్రాక్టు, రోజువారి వేతన కార్మికులు 250 మం ది స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉదయం నుంచీ సాయంత్రం వరకూ సమ్మె నిర్వహించారు.

సమ్మెలోకి మున్సిపల్‌ పారిశుద్ద్య కార్మికులు
శిబిరంలో టీడీపీ, జనసేన నేతలు మస్తాన్‌, శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత

మద్దతుగా నిలిచిన టీడీపీ, జనసేన

మదనపల్లె, జనవరి 3: ముందుగా ప్రక టించినట్లే మున్సిపల్‌ పారిశుద్ద్య కార్మి కులు బుధవారం సమ్మె బాటపట్టారు. విధులు బహిష్కరించిన కాంట్రాక్టు, రోజువారి వేతన కార్మికులు 250 మం ది స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉదయం నుంచీ సాయంత్రం వరకూ సమ్మె నిర్వహించారు. తమ న్యాయపర డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళనలో పాల్గొంటామని యూనియన్‌ నేతలు ప్రకటించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటీయూసీ, జాయింట్‌ యాక్షన్‌కమిటీ మద్దతుతో సమ్మెకు శ్రీకారం చుట్టారు. కార్మికసంఘం, ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సి పల్‌ పర్మనెంట్‌ శానిటరీ కార్మికులకు సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాం డ్‌ చేశారు.

కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాల న్నారు. ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీలు, అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ, అటు ప్రజాప్రతినిధులు, ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకం గా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌.మ స్తాన్‌, ఏఐటీయూసీ నేతలు ఎస్‌.ముభారక్‌, నాగరాజ, తిరుమలప్ప, దేవ, అమర్‌, పృధ్వీరాజ్‌, ఇంద్రాణి, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన మద్దతు

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు టీడీపీ, జనసేన నేతలు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా వారికి సంఘీభా వంగా శిబిరంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కార్మికులకు అనుకూలం గా పెద్దఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ మైనార్టీ సీనియర్‌ నేత ఎస్‌.ఎ.మస్తాన్‌, జనసేన నియోజకవర్గ నేత శ్రీరామ రామాంజనేయులు, జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత కార్మికు లకు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించా రు. కార్యక్రమంలో జనసేన సీనియర్‌ నాయకు డు దారం హరిప్రసాద్‌, స్టూడెంట్‌ విభాగం అధ్యక్షుడు సుప్రీంహర్ష, సోను, అశ్వత్‌, గణేష్‌, రూప బహూదూర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 10:33 PM