Share News

సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:42 AM

నాలుగేళ్లుగా అడుగుతు న్నాం..అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం

మదనపల్లె టౌన, డిసెంబరు 31: నాలుగేళ్లుగా అడుగుతు న్నాం..అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాల యం వద్ద అంగన్వాడీలు వినూత్నంగా నిరసనలు తెలిపారు. 19 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకు ట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకు లు, మదనపల్లె ప్రాజెక్టు పరిధిలోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. మదనపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సీపీయం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ధర్నాకు మద్దతుగా పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం మదనపల్లె రూరల్‌, అర్బన గ్రామ వార్డు సచివాయాల్లో అంగన్వాడీలు వినతి పత్రాలు అందజేశారు.

వాల్మీకిపురంలో: అంగన్వాడీ కార్యకర్తల కనీస డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా పోరాటం తప్పదని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ హెచ్చరించారు. ఆదివారం వాల్మీకిపు రం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్య కర్తలు నిర్వహిస్తున్న సమ్మెకు ఆమె మద్దతు తెలిపారు. గత 20 రోజులుగా అంగన్వాడీలు నిరసనలు చేస్తుంటే చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం వాయిదాల పర్వం మానుకుని తక్షణం అంగన్వాడీల సమస్యలను గుర్తిం చాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, ప్రసన్న, అమ్మాజీ, లక్ష్మీప్రసన్న, నజీ మున్నీసా, గులాబ్‌జాన, నరసమ్మ, దేవసేన, రెడ్డిరాణి, వాల్మీకి పురం, కలికిరి, గుర్రంకొండ మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 20 వ రోజుకు చేరింది. ఆదివారం ఆయా కేంద్రాల వద్ద లబ్ధిదారులతో కలిసి నిరసన తెలియ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయంగా సచివాలయ ఉద్యోగులచే అక్కడక్క డ అంగన్వాడీ కేంద్రాలు తెరచినా తల్లిదండ్రులు వారి పిల్లలను పంపలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. అంగన్వా డీల సమ్మెలో భాగంగా ఆదివారం తంబళ్లపల్లె ఐసీడీఎస్‌ ప్రా జెక్టు పరిధిలో తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండెం మండ లాలకు చెందిన అంగన్వాడీలు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేశా రు. ఈ సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన నాయకురాళ్లు కరుణశ్రీ, సులోచన, ఉమాదేవి, స్వరూపారాణి, శివమ్మ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:42 AM