Share News

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంల తరలింపు

ABN , Publish Date - May 14 , 2024 | 11:45 PM

మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి ఏపీ ఎల్‌ఏ- 164(ఎమ్మెల్యే), హెచ వోపీ- 24(ఎంపీ) ఎన్నికల పోలింగ్‌ ఈవీఎంలను కట్టుది ట్టమైన భద్రత మధ్య మదన పల్లె నుంచి రాయచోటికి తరలిం చారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంల తరలింపు
ఈవీఎంలను కంటైనర్లలోకి ఎక్కిస్తున్న ఆర్‌వో హరిప్రసాద్‌, ఏఆర్‌వో రమాదేవి

మదనపల్లె టౌన, మే 14: మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి ఏపీ ఎల్‌ఏ- 164(ఎమ్మెల్యే), హెచ వోపీ- 24(ఎంపీ) ఎన్నికల పోలింగ్‌ ఈవీఎంలను కట్టుది ట్టమైన భద్రత మధ్య మదన పల్లె నుంచి రాయచోటికి తరలిం చారు. సోమవారం నియోజకవ ర్గంలోని 260 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలు మదనపల్లె సా్ట్రంగ్‌ రూమ్‌ చేరుకునే సరికి అర్ధరాత్రి అయింది. దీంతో రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ వాటిని రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో సా్ట్రంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. అనంతరం మంగళవారం సా్ట్రంగ్‌రూమ్‌ నుంచి ఈవీఎంలు, బ్యాలెట్‌ యూని ట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ యంత్రాలను ఐదు కంటైనర్లలో ఎక్కించా రు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంఽధించి 260, పార్లమెంట్‌ ఎన్నికలకు సంబం ధించి 260 ఈవీఎం యంత్రాల యూనిట్లను ఐదు కంటైనర్లలో ఎక్కించి ఆర్‌వో సీలు వేశారు. వాటిని సాయుధ బలగాల భద్రత మధ్య వనటౌన సీఐ ఉజాల వలీబషు, తాలూకా సీఐ శేఖర్‌ ఆధ్వర్యంలో ఎస్కార్ట్‌ వెంట రాగా రాయచోటికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌వోలు పాల్గొన్నారు.

పీలేరులో: పీలేరులో పోలింగ్‌ ముగిసిన తరువాత నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి అధికారులు ఈవీఎంలను పీలేరులోని సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సా్ట్రంగ్‌ రూముకు తరలించా రు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈవీఎంలు అక్కడికి చేరేసరికి మంగళవారం ఉదయం అయింది. వెంటనే ఉదయం అక్కడి నుంచి గట్టి బందోబస్తు మధ్య వాటిని పీలేరు ఆర్‌వో ఫర్మాన అహ్మన ఖాన, పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి పర్యవేక్షణలో జిల్లా కేంద్రమైన రాయచోటికి పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య వాటిని తరలించారు.

ములకలచెరువులో: తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు జిల్లా కేంద్రమైన రాయచోటికి చేరాయి. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు కురబలకోట మండలం అంగళ్ళు మిట్స్‌ కళాశాలలోని స్త్రాంగ్‌రూంకు చేరాయి. ఈ క్రమంలో మంగళవారం ఈవీఎంలను ప్రత్యేక కంటైనర్లలో జిల్లా కేంద్రమైన రాయచోటికి పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య వారిటిని తరలించారు.

Updated Date - May 14 , 2024 | 11:45 PM