అంగనవాడీ కేంద్రాల్లో మెనూ పాటించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:35 PM
అంగనవాడీ కేంద్రాల్లో నిర్దేశించిన మెనూ ప్రకారమే తప్పనిసరిగా పిల్లలకు ఆహారం అందజేయాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ స్పష్టం చేశారు.

మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్
కలికిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అంగనవాడీ కేంద్రాల్లో నిర్దేశించిన మెనూ ప్రకారమే తప్పనిసరిగా పిల్లలకు ఆహారం అందజేయాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కలికిరి-1, కలికిరి-4 అంగనవాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేంద్రా ల్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను, పిల్లల హాజరును పరిశీ లించారు. అనంతరం చిన్న పిల్లలకు అందజేస్తున్న ఆహార పదా ర్థాలను పరిశీలించి ఆహార పదార్థాలను వండుతున్న విధానాల ను ప్రత్యక్షంగా పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం ఎందుకు తయారు చేయలేదని కార్యకర్తలను ప్రశ్నించారు. కార్యకర్తల సమాధానాలతో సబ్‌కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఎక్కడో పొరబాటు జరుగుతోందని మెనూ జాబితాలను పరిశీలించారు. గురువారం అన్నం, ఆకుకూర పప్పు, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడి గుడ్డు (ఉదయం అల్పాహారంగా) ఇవ్వాల్సి ఉంది. అయితే అన్నంలోకి సాంబారు మాత్రమే అందించడం పట్ల సబ్ కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాల్మీకిపురం సీడీపీవో భారతి మెనూ జాబితాను సబ్‌కలెక్టరుకు చూపించారు. ఈ మెనూ గర్భిణులతో కలిపి చిన్న పిల్లలకు కూడా అందజే స్తున్నదని వివరించారు. ప్రస్తుతం గర్భిణులకు వండిన ఆహారం అందజేయడం లేదని, సరుకులన్నీ వారి ఇంటి వద్దకే చేరుస్తు న్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు మాత్రం వండాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించిన మెనూ ఇంత వరకూ రాలేదని, ఈ కారణంగా పాత మెనూలోని ఒక కూరను మాత్రమే అందజే స్తున్నట్లు విశదీకరించారు. కొత్త మెనూను వెంటనే తెప్పించుకు ని ఆ మేరకు ఆహార పదార్థాలు అందజేయాలని ఆయన ఆదేశిం చారు. అక్కడే వున్న భవిత కేంద్రాన్ని సందర్శించారు. అనంత రం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు మహేశ్వరీ బాయి, వాల్మీ కిపురం సీడీపీవో భారతి, సూపర్‌వైజర్ అరుంధతి, కార్యకర్తలు సూర్యకళ, బేగం పాల్గొన్నారు. సమావేశానికి తహసీల్దారు, డీటీ నవీన, సర్వేయర్లు, వీఆర్వోలు హాజరయ్యారు.