Share News

అంగరంగ వైభవంగా ఆకేపాడు మారమ్మ జాతర

ABN , Publish Date - May 19 , 2024 | 09:40 PM

ఆకేపాడు మజరా లచ్చయ్యగారిపల్లెలో రెండు రోజులుగా మారమ్మ జాతర నిర్వహించారు. రాజంపేట మండల ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగా రెడ్డి, ఆకేపాటి గోపాల్‌రెడ్డి ఫౌండేషన ట్రస్ట్‌ చైర్మన ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి (మురళి) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఈ వేడుకలు నిర్వహించారు.

అంగరంగ వైభవంగా ఆకేపాడు మారమ్మ జాతర
మారమ్మ ఆలయం వద్ద భక్తులు

రాజంపేట, మే 19: ఆకేపాడు మజరా లచ్చయ్యగారిపల్లెలో రెండు రోజులుగా మారమ్మ జాతర నిర్వహించారు. రాజంపేట మండల ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగా రెడ్డి, ఆకేపాటి గోపాల్‌రెడ్డి ఫౌండేషన ట్రస్ట్‌ చైర్మన ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి (మురళి) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. చుట్టుపక్కల పది గ్రామాల్లో మారమ్మ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మారమ్మ దేవతను ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆకేపాటి గోపాల్‌రెడ్డి ఫౌండేషన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రెండు రోజులుగా చెక్కభజన, పండరి భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ దేవతకు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. కార్యనిర్వాహకులు ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో ఎల్లమ్మకు 200 సంవత్సరాల క్రితం జాతర నిర్వహించేవారని, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల అవి జరగలేదన్నారు. ఇటీవలనే ఆలయాన్ని పునరుద్ధరించి గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించామన్నారు

Updated Date - May 19 , 2024 | 09:40 PM