Share News

చీటింగ్‌ కేసులో మడకశిర ఎంఈవో అరెస్ట్‌

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:53 PM

సచివాలయ ఉద్యోగాల పేరిట నకిలీ అపా యింట్‌మెంట్‌ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను చీటింగ్‌ చేసిన కేసులో సత్య సాయి జిల్లా మడకశిర ఎంఈవోను తంబళ్లపల్లె పోలీసులు శని వారం అరెస్టు చేశారు.

చీటింగ్‌ కేసులో మడకశిర ఎంఈవో అరెస్ట్‌

తంబళ్లపల్లె, జనవరి 6: సచివాలయ ఉద్యోగాల పేరిట నకిలీ అపా యింట్‌మెంట్‌ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను చీటింగ్‌ చేసిన కేసులో సత్య సాయి జిల్లా మడకశిర ఎంఈవోను తంబళ్లపల్లె పోలీసులు శని వారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి తెలిపిన వివరాల మేర కు...2021లో సత్య సాయి జిల్లాకు చెందిన లక్ష్మీదేవి(ఏ1), మరొక వ్యక్తి(ఏ2), మడకశిర ఎంఈవో శ్రీనివాసులు(ఏ3) సచివాలయంలో ఉద్యోగాల పేరిట నకిలీ అపాయింట్మెంట్‌ లెటర్లు సృష్టించి నిరుద్యోగు లకు ఇచ్చి మోసం చేశారన్నారు. అదే సంవత్సరంలో తంబళ్లపల్లె మండలంలో సచివాలయ ఉద్యోగిగా విధుల్లో చేరడానికి ఓ యువతి, తన మామతో కలసి నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌తో తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిందన్నారు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ చూసిన ఎంపీడీవోకు అనుమానం వచ్చి ఆరాతీయగా అది ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అని గుర్తించి తంబళ్లపల్లె పోలీస్టేషనలో ఫిర్యాదు చేశారన్నారు. ఎంపీడీవో ఫిర్యాదుతో చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులను ఇదివ రకే అరెస్టు చేయగా శనివారం ఏ3 నిందితుడిగా ఉన్న మడకశిర ఎంఈవోను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 11:53 PM