Share News

మధ్యాహ్న భోజనం శుచిగా తయారు చేయాలి

ABN , Publish Date - May 31 , 2024 | 10:45 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత గల భోజనాలు తయారు చేయాలని మండల విద్యాశాఖాధికారులు పోతు రాజు రామయ్య, సుందర్‌బాబు తెలిపారు.

మధ్యాహ్న భోజనం శుచిగా తయారు చేయాలి
రైల్వేకోడూరు: వంట పోటీల్లో విజేతలకు బహుమతులు ఇస్తున్న అధికారులు

రైల్వేకోడూరు, మే 31: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత గల భోజనాలు తయారు చేయాలని మండల విద్యాశాఖాధికారులు పోతు రాజు రామయ్య, సుందర్‌బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక హెచ ఎంఎం హైస్కూలు లో వంట ఏజెన్సీలు, హెల్పర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంట ఏజెన్సీలు, హెల్పర్లు ప్రభుత్వ మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. భోజనాలు తయారు చేసే ప్రాంతం పరి శుభ్రంగా ఉండాలన్నారు. వంట వస్తువులు వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లు టీ. శివశంకర్‌రెడ్డి, హెచఎంఎం హైస్కూలు ప్రధానోపాధ్యా యుడు కె. వెంకటరమణ, ఉపాధ్యాయులు కె. ఫణీంద్రయాదవ్‌, ఎంసీ సంపతకుమార్‌, బీవీ విక్రమవర్మ, కె. విజయకుమార్‌, విద్యాశాఖ సిబ్బంది ఎన. బాలాజీ, పీ. సుబ్రహ్మణ్యం, సీ. అరుణ, కె. అరుణకుమారీ, డీ. గోపీక్రిష్ణ, వంట ఏజెన్సీ, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి

లక్కిరెడ్డిపల్లె : విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిం చాలని మండల విద్యాశాఖ అధికారి (2) వెంకటసుబ్బయ్య సూచించా రు. శుక్రవారం స్థానిక ఎంఈవో కార్యాలయంలో మండలంలోని వంట ఏజెన్సీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ జూన్‌ 12 నుంచి పాఠశాలలు పున;ప్రారంభమవుతాయని వంట ఏజేన్సీలు అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు మెను తప్పక పాటించాలని సూచించారు అనంతరం వంటల పోలీలు నిర్వహించారు. మంచి వంటలను చేసిన మహిళలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీయూఎస్‌ జిల్లా మీడియా ఇచార్జి వెంకటేశ్వర్లు , సీఆర్పీలు రామ్మోహన్‌ , శశికళ, చంద్రకళ పాల్గొన్నారు

Updated Date - May 31 , 2024 | 10:45 PM