కనుల పండువగా శ్రీకృష్ణ కల్యాణం
ABN , Publish Date - Aug 26 , 2024 | 10:38 PM
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండలం లోని అరవపల్లె శ్రీకృష్ణ మందిర ఆవరణలో సోమవారం రుక్మిణీ సత్య భామ శ్రీకృష్ణ కల్యాణం నిర్వహించారు.
నందలూరు, ఆగస్టు 26 : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండలం లోని అరవపల్లె శ్రీకృష్ణ మందిర ఆవరణలో సోమవారం రుక్మిణీ సత్య భామ శ్రీకృష్ణ కల్యాణం నిర్వహించారు. ఉభయం దారులుగా భార తాల శివయాదవ్, లక్ష్మీదేవి దంపతులు వ్యవహరిం చారు. ఈ సందర్భంగా చిన్నారులను చిన్నికృష్ణుడిగా అలంకరించి కల్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు. ఉదయం తాటి సుబ్బరాయుడు, లక్ష్మీదేవి ఆధ్వర్యంలో గోపూజ చేశారు. భక్తులకు ఉప్పుశెట్టి సుధీర్ కుమార్, ఉప్పుశెట్టి పృఽధ్విరాజ్, గండికోట క్రిష్ణకుమార్ మజ్జిగ ప్యాకెట్ల ను అందజేశారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జగనమోహనరాజు, రాజంపేట ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతి నిధి మేడా విజయశేఖర్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్‌రెడ్డి, బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిలోకేష్, ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన యెద్దల సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓంశాంతి నగర్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పూజలు చేశారు.
రూ.3,11 లక్షలు పలికిన కల్యాణం లడ్డూ
అరవపల్లెలోని గీతామందిరంలో సోమవారం ఉదయం శ్రీకృష్ణ కల్యాణం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో నీలిపల్లెకు చెందిన ఉప్పుశెట్టి విజయమ్మ రూ. 3.11 లక్షలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికా ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి, బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిలోకేష్, నిర్వాహకులు పాల్గొన్నారు.
రాయచోటిటౌన: పట్టణ పరిధిలోని పాతగొల్లపల్లిలో సోమవారం నిర్వ హించిన శ్రీకృష్ణ కల్యాణోత్సవంలో రాజంపేట టీడీపీ ఇనచార్జి సుగ వాసి బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వదించి శ్రీ కృష్ణుని తీర్థప్రసాదాలను అందజేశారు. రాజంపేట, రాయచోటి నియో జకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లె: కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం కోర్టు వద్ద నున్న శ్రీ కృష్ణాలయంలో పూజలు నిర్వహించారు. విశ్రాంత ఉపాద్యాయుడు రామకృష్ణయ్య భగవద్గీత పారాయణం చేశారు. కృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టారు. అనంతరం దేవస్థానం వ్యవస్థాపకుడు వీర బల్లి చెన్నకృష్ణయ్య భక్తులకు అన్నదానం చేశారు.
రామాపురం: మండలంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి చిత్రపటం ఊరేగించారు. మండ లంలోని హిందూ ధార్మిక సంఘాలు, విశ్వహిందూ పరిషత, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో వీహెచపీ అన్నమయ్య జిల్లా సహాయ సంయోజక్ వీరారెడి, మండల అధ్యక్షులు ప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దామోధర్‌నాయుడు, మోహననాయుడు, కదిరయ్య, రాచపల్లెకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. కొండపల్లి సమీపంలోని శ్రీకృష్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
పెనగలూరు: పెనగలూరు వేణుగోపాలస్వామి ఆలయంలో వేణుగోపాల స్వామి యూత సభ్యుల సహకారంతో అభిషేకం, అలంకరణ చేశారు. కొత్త గోపాలయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ఉట్టి కొట్టే కార్యక్రమం అలరించింది.
గాలివీడు: పట్టణంలోని అరవీటివాండ్లపలె శ్రీకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించారు. నిర్వాహకులు అన్నప్రసాదాల వితరణ చేశారు.
సుండుపల్లి: మండలంలోని రెడ్డంపల్లి సమీపంలోని శ్రీకృష్ణుడి అలయం లో పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.
రైల్వేకోడూరు(రూరల్): మండలం పరిధిలోని మైసూరివారిపల్లె పంచా యతీ శ్రీకృష్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారుు. మహిళలు కోలాటం ప్రదర్శించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం అలరించింది.
వీరబల్లి: స్థానిక షిర్డీసాయి మందిరంలో వేడుకలు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకుడు మల్లేశ తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీనివాసులు, మధుసూదనరెడ్డి, ఎర్రిస్వామి, నాగమల్‌రెడ్డి, వీఆర్‌డీఎస్ సురేంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఒంటిమిట్ట: స్థానిక సాయిభారతి విద్యాలయంలో విద్యార్థులు గోపికలు, శ్రీకృష్ణ వేషధారణలో చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రామతులసి, ప్రధానోపాధ్యాయుడు సుబ్బరామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిట్వేలి: మండల పరిధిలోని చిల్లావాండ్లపల్లె శ్రీకృష్ణుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వెన్న, పాలు నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.