Share News

రోడ్లిలా... వెళ్లేదెలా...?

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:28 PM

జగన్‌ పాలనలో రోడ్లను గాలికి వదిలేసింది. ఐదేళ్లలో కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంత చాలాచోట్ల గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు రోడ్ల పనులు చేపట్టింది. అయితే నిఽధుల్లేక కేవలం నాలుగు శాతం పనులు మాత్రమే చేసి కాంట్రాక్టర్లు చేతు లెత్తేశారు. దీంతో ఉన్నది పోయి... కొత్తదీ రాక జనం మరింత అవస్థలు పడుతున్నారు.

రోడ్లిలా... వెళ్లేదెలా...?
పాలెంపల్లె వెళ్లే దారిలో గుంతలమయమైన రోడ్డు - రాచిన్నాయపల్లె వద్ద సగం వేయని సిమెంటు రోడ్డు

నాలుగు నెలలు దాటినా .. నాలుగు శాతం పనులేనా?

రూ.26 కోట్ల పనులు ఎప్పటికయ్యేను

నిధులు లేకే పక్కన పెట్టేశారా

రాచిన్నాయపల్లె వద్ద సగం రోడ్డుతో అన్నీ సమస్యలే

ఇదీ జగన్‌ పాలనతో రోడ్ల దుస్థితి

చెన్నూరు, ఏప్రిల్‌ 19: జగన్‌ పాలనలో రోడ్లను గాలికి వదిలేసింది. ఐదేళ్లలో కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంత చాలాచోట్ల గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు రోడ్ల పనులు చేపట్టింది. అయితే నిఽధుల్లేక కేవలం నాలుగు శాతం పనులు మాత్రమే చేసి కాంట్రాక్టర్లు చేతు లెత్తేశారు. దీంతో ఉన్నది పోయి... కొత్తదీ రాక జనం మరింత అవస్థలు పడుతున్నారు.

గ్రామీణప్రాంతాలను పట్టణానికి అనుసంధానం చేసి ప్రజలకు మంచి రోడ్డును, వంతెనలను అందించా ల్సిన ప్రభుత్వం టెండరు పేరుతో రూ.26 కోట్లు మం జూరు చేయడం జరిగింది. అంత వరకూ బాగానే ఉంది. అయితే పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. అసలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. దీంతో నిత్యం ఆ దారిన తిరిగే ప్రజలు అసలు రోడ్డు ఇప్పట్లో పూర్తవుతుందా, ఆ రోడ్డుపై మనం తిరిగే అవకాశం ఉందా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకోవడం జరుగుతుంది.

చెన్నూరు మండలంలోని దేవునికడప ఆర్చి నుంచి గుర్రం పాడు, ముండ్లపల్లె, రామనపల్లె, రాచిన్నాయపల్లె మీదుగా పాలెంపల్లె రోడ్డు హైవే సమీప బైపాస్‌ వరకు నాలుగునెలల కిందట రూ.26 కోట్ల పనులకు వైసీపీ ప్రజాప్రతినిఽధులు శంకు స్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వచ్చే ఈ రోడ్డులో అటు ముండ్లపల్లె వద్ద, ఇటు రాచిన్నయపల్లె - పాలెంపల్లె బైపాస్‌ వద్ద రెం డు వంతెనలు పూర్తి కావాలి. అక్కడక్కడా కల్వర్టు వేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు పొందిన వ్యక్తి ఇప్పటి వరకు రూ.26 కోట్ల పనులకు సంబంధించి 4శాతం పనులు మాత్రమే చేశారు. దేవునికడప ఆర్చి నుంచి ఓబులంపల్లెకు వచ్చే దారిలో టెండరు వేయకముందు సింగిల్‌రోడ్డు ఉండేది. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒక టి ఆగిపోయి దారి ఇవ్వాల్సి వచ్చేది. ఆ దారిని వెడల్పు చేస్తే రవాణా సమస్యలు తప్పేవి.

కాంట్రాక్టరు పనులు మొదలుపెట్టి అక్కడ రెండు కల్వర్టులు మాత్రమే పూర్తి చేశారు. రోడ్డు పనులు సైతం మొదలుపెట్టి చేశారు. అలాగే ఓబుళంపల్లె నుంచి ముండ్లపల్లె వచ్చే దారి కూడా సన్నగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ఈ గ్రామం దాటిన తరువాత ముండ్లపల్లె వైపు వస్తే చిన్నపాటి వంతెన ఉప్పువంకపై ఉంది. ఇది వర్షాకాలం పొంగిందం టే ఈ చిన్నపాటి వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రవహించేది ఒకటి రెండు రోజులైనా రాకపోకలకు మాత్రం ఇబ్బందే. ఇటు ముండ్లపల్లె ఓబుళంపల్లె వద్ద రాకపోకలు ఉప్పువంక పొంగినప్పుడు ఆగాల్సిందే. ఇక్కడ ఈవంతెన ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రూ.26 కోట్లలోనే ఈ వంతెన పని కూడా ఉంది. రోడ్డు పనులే పూర్తికాక పోవడంతో ఇక వంతెనలు ఎప్పటికి అవుతాయో ఆ జగనన్నకే తెలియాలని ప్రజలు అంటున్నారు.

రాచిన్నాయపల్లె వద్ద సగం రోడ్డుతో సమస్యలే

రామనపల్లె నుంచి రాచిన్నాయపల్లెకు వచ్చే దారిలో సిమెంటు రోడ్డు సగం మాత్రమే వేశారు. అంటే ఒక వైపు మాత్రమే సగం సిమెంటు రోడ్డు వేసి మరో వైపు మిగిలిన సగం వేయకుండా చాలా కాలం ఆపివేశారు. దీంతో వేసిన సిమెంటు రోడ్డు అడుగుకు పైగా ఎత్తు ఉండడంతో ఇటీవల ప్రమాదాలు జరిగాయి. రాత్రివేళల్లో పలువురు ద్విచక్ర వాహనదారులు ఈ తగ్గుగా ఉన్న రోడ్డులో పడి చేతులు విరుగ్గొట్టుకున్నారు. ఎన్నికల ముందు రోడ్డు అరకొర వేసి తమను ఎందుకు ఎందుకు ఇబ్బందులపాలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా రాచిన్నాయల్లె ఊరు దాటిన తరువాత అటు పాలెంపల్లె వెళ్లే వంతెన వర కు పలు చోట్ల తారురోడ్డులో ఎక్కువ గుంతలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా ప్రమాదాలకు కారణమవుతున్పాయి. నిధులు లేకనే పనులు ఆగాయని ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు ఆరోపిస్తున్నారు.

రూ.26 కోట్ల పనులకు సంబంఽధించి ఆర్‌అండ్‌బీ డీఈ కళ్యాణిని వివరణ కోరగా ఇప్పటికే 5 నుంచి 10 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. రాచిన్నాయపల్లెలో సగం రోడ్డు వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించామని.. రెండుమూడురోజుల్లో పనులు చేపడతారని అన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:28 PM