Share News

ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందాం!

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:02 AM

ఐకమత్యంతో ఉంటూ రాజ్యాధికారం సాధించుకుం దామని రాష్ట్రంలోని బలిజలకు కాపు సంక్షేమ సేన గౌరవ సలహాదారు ఆ మంచి శ్రీనివాసులు అలియాస్‌ ఆమం చి స్వాములు పిలుపునిచ్చారు.

ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందాం!
సమావేశంలో మాట్లాడుతున్న ఆమంచి శ్రీనివాసులు

ఫ బలిజలకు కాపు సంక్షేమ సేన నేత ఆమంచి శ్రీనివాసులు పిలుపు

పీలేరు, జనవరి 11: ఐకమత్యంతో ఉంటూ రాజ్యాధికారం సాధించుకుం దామని రాష్ట్రంలోని బలిజలకు కాపు సంక్షేమ సేన గౌరవ సలహాదారు ఆ మంచి శ్రీనివాసులు అలియాస్‌ ఆమం చి స్వాములు పిలుపునిచ్చారు. పీలేరు మండలం గూడరేవుపల్లె పంచాయతీ మొరవవడ్డిపల్లెలో గురువారం పీలేరు మండల బలిజల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో కేవలం 15 శాతం లేని వారు రాజ్యాధికారం చేపట్టి పాలిస్తున్నారని, జనాభాలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్న కాపులు, బలిజలు రాజ్యాధికారానికి దూరంగా ఉండిపోతున్నారన్నారు. బలిజలు రాజ్యాధి కార సాధన కోసం ఉద్యమించాలని ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపేందుకు హరిరా మజోగయ్య వంటి అనుభవజ్ఞులు తమకు అండగా ఉన్నారన్నారు. రాజకీయాల్లో ఒక దీక్షతో పవన కళ్యాణ్‌ ముందుకు సాగుతున్నారని, రాష్ట్రంలోని బలిజలు ఆయనకు అండ గా నిలవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ అన్నమ య్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేశ, జనసేన పీలేరు నియోజకవర్గ ఇనఛార్జ్‌ బెజవాడ దినేశ, మదనపల్లె ఆర్‌ఆర్‌ జ్యువెలర్స్‌ అధినేత రామాంజులు, అన్నమయ్య జిల్లా కాపు సంక్షేమ సేన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శరత బాబు, అధ్యక్షురాలు రెడ్డిరాణి, నాయకులు దారం అనిత, సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:02 AM