Share News

కృష్ణార్పణం..

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:58 PM

కుప్పంకు కృష్ణాజలాలు తరలించేస్తున్నాం. చెరువులు నింపేస్తాం. వ్యవసాయ భూములు సస్యశ్యామలం చేసే స్తాం...ఇది మావల్లే సాధ్యం అని జగనరెడ్డి ప్రభుత్వం బీరాలు పలికి నప్పటికీ అది కేవలం ఎన్నికల స్టంట్‌గానే మిగిలిపోయింది అనేది ప్రజలమాట.

కృష్ణార్పణం..
ఇటీవల కుప్పం వైపుకు ఈ కాలువ గుండా ప్రవహించిన కృష్ణాజలాలు బి. కొత్తకోట శివారులో చుక్కనీరు లేక బోసిపోయిన హంద్రీ-నీవా కాలువ

చెరువులు నింపకుండా

కాలువ పారించారు

కుప్పం తరలించేందుకు

అధికారుల యాతన

అలా చూపించి...ఇలా ఆపేశారు

ఎన్నికల స్టంట్‌గా అభివర్ణిస్తున్న జనం

బి కొత్తకోట, ఏప్రిల్‌ 7:కుప్పంకు కృష్ణాజలాలు తరలించేస్తున్నాం. చెరువులు నింపేస్తాం. వ్యవసాయ భూములు సస్యశ్యామలం చేసే స్తాం...ఇది మావల్లే సాధ్యం అని జగనరెడ్డి ప్రభుత్వం బీరాలు పలికి నప్పటికీ అది కేవలం ఎన్నికల స్టంట్‌గానే మిగిలిపోయింది అనేది ప్రజలమాట. హంద్రీ-నీవా పుంగనూరు బ్రాంచి కెనాల్‌ పరిధిలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలలో 91 చెరువు లకు కాలువద్వారా కృష్ణాజలాలు అందించాల్సివున్నా ఆ ప్రయత్నం ఏదీ జరగలేదు. కుప్పం లో నీటిని చూపితేచాలు అన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు హెచ ఎనఎస్‌ఎస్‌ అఽధికారులు తంటాలుపడుతూ, యాతన అనుభవించారు. వేలకోట్లు ఖర్చు చేసి హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువను నిర్మించారు. నాలుగేళ్లుగా ఎత్తిపోతల పథకాలు, కాలువ నిర్వహణకు రూపాయి విదిల్చని ప్రభుత్వం ఎన్నికల ఏడాది లో మాత్రం మరోసారి హంద్రీ-నీవా జలాలను తీసుకొచ్చి హడావిడి చేశారు.

టీడీపీ హయాంలోనే జిల్లాకు హంద్రీ-నీవా జలాలు

హంద్రీ-నీవా సుజల స్రవంతి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయరుకు, అక్కడినుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయరుకు తరలుతుంది. అక్కడినుంచి పుంగనూరు బ్రాంచికెనాల్‌ ద్వారా అన్నమ య్య, చిత్తూరు జిల్లాల మీదుగా పలమనేరు సమీపంలోని అప్పినపల్లి వద్దకు అక్కడి నుంచి కుప్పం బ్రాంచికెనాల్‌ ద్వారా పరమసముద్రం వరకు 743 కిలోమీటర్లు ప్రవహించి కుప్పంకు నీరు చేరాల్సివుంది. దీనికోసం 8ప్యాకేజీలు, 38 లిఫ్టులు ఏర్పాటు చేశారు. చెర్లోపల్లి రిజర్వా యరు నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనికి పుంగనూరు బ్రాంచి కెనా ల్‌ ద్వారా టీడీపీ హయాంలోనే నీటిని పారించారు. కొన్ని చెరువులకూ నీటిని విడుదల చేశారు. కాలువనిర్మాణం కోసం మదనపల్లె వద్ద 3కిలోమీటర్ల సొరంగం, కుప్పం ఉపకాలువ కు పలమనేరు బైరెడ్డిపల్లి మండలాల్లో సొరంగాలు తవ్వించారు.

కుప్పం బ్రాంచకెనాల్‌కు అప్పట్లోనే రూ.144 కోట్లు

పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లి నుంచి ప్రారంభం అయ్యే కుప్పం బ్రాంచకెనాల్‌ నిర్మాణం పూర్తి అయినా అదనపు మట్టిపనులు, కాంక్రీటు నిర్మాణాలకు అదనంగా 2018లో జీవో నంబరు 32 తీసుకొచ్చి రూ.144.7 కోట్లు విడుదల చేసింది. దీంతో కుప్పం బ్రాంచి కెనాల్‌ పను ల విలువ రూ.574 కోట్లకు చేరింది. 123 కి.మీలు సాగే ఈ బ్రాంచకె నాల్‌పై శంకర్రాయలపేట, పసుపత్తూరు, ఆదినేపల్లి వద్ద ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తారు.

చెరువులు నింపడంలో చిత్తశుద్ధి ఏదీ..

వైసీపీ హయాంలో రెండుసార్లు హంద్రీ-నీవా నీటిని జిల్లాకు తరలించి నా స్థానికంగా ఉన్న చెరువులను నింపాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించలేదనే విమర్శలు వున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కుప్పంకు తాము ఏదో చేసేశాము అని అక్కడి ఓటర్లకు భ్రమ కల్పించడానికి మాత్రమే హంద్రీ-నీవా జలాలు ఆవిరి అయిపోయాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,80,450ఎకరాలకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. రూ.2,905 కోట్ల అంచనా తో ప్రారంభమై, పూర్తి అయ్యేసరికి 3,900 కోట్లకు పైగా ఖర్చు అయిం ది. మదనపల్లి డివిజనలో 92 చెరువులను హంద్రీ-నీవా ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఆ ధిశగా తీసుకున్న చర్యలు శూన్యం.

కృష్ణా జలాలు గాలికి ఆవిరి..

చెర్లోపల్లి రిజర్వాయరు నుంచి 7 లిఫ్టుల ద్వారా పుంగనూరు బ్రాంచి కెనాల్‌ మీదుగా అప్పినపల్లెకు, అక్కడి నుంచి కుప్పం ప్రాంతంలోని పరమసముద్రం చెరువుకు నీటిని తరలించేందుకు రెండునెలలు పట్టిం ది. ఎండవేడికి నీరు ఆవిరి అయిపోవడం, కాలువలో ఇంకిపోవడంతో చెర్లోపల్లినుంచి 150-200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా కుప్పం కు 10 క్యూసెక్కులు కూడా చేరలేదు. సుమారు 400కి.మీ.లు దూరం ప్రవహించాల్సివున్నందున నీరు వేగంగా ముందుకు సాగలేదు. చెర్లోప ల్లి రిజర్వాయరు నీటినిల్వ సామర్థ్యం 1.618టీయంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 0.4 టీయంసీలకు పడిపోయింది. శ్రీశైలం నుంచి నీటి లభ్య త తగ్గడంతో లిఫ్టింగ్‌ను ఆపేశారు. కుప్పం చేరిన నీరు సీయం పర్య టన హడావిడి మాత్రమే కనిపించి ఆ తర్వాత కాలువ బోసిపోయింది.

Updated Date - Apr 07 , 2024 | 11:59 PM