Share News

అంగరంగ వైభవంగా కొత్తపురమ్మ జాతర

ABN , Publish Date - May 25 , 2024 | 10:26 PM

కోడి వారి కుటుంబ ఆడబిడ్డ సాధు వారి కోడలుగా పిలుచుకునే దుద్యాల గ్రామ దేవత కొత్తపురమ్మ జాతర శనివారం అంగరంగ వైభ వంగా నిర్వహించారు.

అంగరంగ వైభవంగా కొత్తపురమ్మ జాతర
భక్తుల కోసం సిద్ధం చేసిన సిద్దల ప్రసాదం

సంబేపల్లె, మే 25: కోడి వారి కుటుంబ ఆడబిడ్డ సాధు వారి కోడలుగా పిలుచుకునే దుద్యాల గ్రామ దేవత కొత్తపురమ్మ జాతర శనివారం అంగరంగ వైభ వంగా నిర్వహించారు. ఉదయం పుట్టబంగారం తెచ్చి కోనేటి స్నానాలు చేయించారు. అనంతరం పొంగు బాలు, నాణ్యములు ఎదురు రావడం కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిద్దల సాంగ్యం నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో సంతానం లేని మహిళలు అమ్మవారికి వరపడి సిద్దల ప్రసాదం స్వీకరించారు. ఆసాదులు అమ్మవారి చరిత్ర చదివి వినిపించారు. బైనేనివారు గావు పట్టా రు. అనంతరం భక్తులు బోనాలను సమర్పించారు. రాత్రి చాందినీ బండ్లు ఊరేగించనున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కళ్లుపాటు కార్యక్రమంతో అమ్మ వారి జాతర వైభవంగా ముగియనుంది.

Updated Date - May 25 , 2024 | 10:26 PM