Share News

కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:52 PM

వాల్మీకిపురం పట్టణంలోని పట్టాభిరాముడి సాలక ట్ల్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మ హోత్సవం కన్నుల పండుగగా సాగింది.

కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం
కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తజనం

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 17: ఉదయం సుప్రభాత సేవ, ఆలయం లోని మూలవర్లకు నిత్య కైంకర్యములతో ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుచ్చి ఉత్సవం అనంతరం భోగోత్సవమూర్తులకు స్నపనతి రుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం సీతారామలక్ష్మణు లకు ఊంజల్‌సేవ నిర్వహిం చారు. సీతారాముల కల్యాణ ఘట్టం తిల కించిన భక్తజనం పులకించిపో యారు. ఈసందర్భంగా మండల పరిష త, గ్రామ పంచాయతీ తరపున, టీటీడీ అధికారుల చేత కల్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పిం చారు. కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

గరుడునిపైౖ పట్టాభిరాముడి వైభవం

కల్యాణోత్సవం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన పట్టాభిరాముడిని తనకెంతో ప్రీతిపాతమైన గరుడ వాహనంపై విశేషాలంకరణలతో అధిష్టింప చేసి పట్టణ పురవీధులలో నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బాణాసంచా, టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు అల రించాయి. ఈకార్యక్రమాలలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌,సూప రింటెండెంట్‌ వెంకటస్వామి,ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, ఆల య అధికారులు కృష్ణమూర్తి, నాగరాజ్తు,అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచా ర్యులు, కృష్ణప్రసాద్‌, కృష్ణరాజు, భాషికాచార్యు లు, రామ్‌గోపాల్‌ బృందం, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలలో నేడు రథోత్సవం

బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం పట్టాభిరాముడిని బ్ర హ్మరథంపై నగరోత్సవం, సాయంత్రం ధూళి ఉత్సవం జరగనున్నాయి.

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 17: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా గురువారం శ్రీరా మ నవమి పండుగ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. స్థానిక పట్టాభి రామాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో నవమి వేడుకలు నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేతత పట్టాభిరాములకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్ర సాదాలు పంపిణీ చేశారు. మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శ్రీరాముడి చిత్రపటానికి పూజలు చేసి వేడుకలు నిర్వహించారు.

Updated Date - Apr 17 , 2024 | 11:52 PM