Share News

ఆక్రమణలో జూనియర్‌ కళాశాల స్థలాలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:29 PM

వాల్మీకిపురం పట్టణంలోని మదనపల్లె మార్గంలో ఉన్న పీవీసీ ప్రభుత్వ జూని యర్‌ కళాశాలకు చెందిన హైల్యాండ్‌ స్థలాలు ఆక్ర మణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరు వయ్యారు.

ఆక్రమణలో జూనియర్‌ కళాశాల   స్థలాలు
హైల్యాండ్‌ మైదానంలో అక్రమ నిర్మాణాలు

ఇష్టారాజ్యంగా నిర్మాణాలు గత వైసీపీ హయాంలో అడ్డూ అదుపులేకుండా ఆక్రమణలు

పట్టించుకోని అధికారులు

వాల్మీకిపురం, జూలై 28: వాల్మీకిపురం పట్టణంలోని మదనపల్లె మార్గంలో ఉన్న పీవీసీ ప్రభుత్వ జూని యర్‌ కళాశాలకు చెందిన హైల్యాండ్‌ స్థలాలు ఆక్ర మణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరు వయ్యారు. గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ అండ దండలతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలకు తెరలేపిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 1975 నాటి రోజుల్లో అప్పటి పోలేపల్లె కుటుంబీకులు సర్వే నెంబరు 1357-1ఎ నందు 3.70ఎకరాల స్థలాలను విరాళంగా అందజేశారు. తరువాత 2013 నాటి రోజుల్లో జిల్లా కలెక్టర్‌ ద్వారా హైల్యాండ్‌ స్థలాలు ప్రభుత్వ జూని యర్‌ కళాశాలకు కేటాయించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆస్థలాలకు ఎలాంటి రక్షణ లేకుం డా పోయింది. ఎటు చూసినా ఆక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కళా శాలకు చెందిన ఈ స్థలాలలో అనుమతులు లేకుం డానే అంగనవాడీ కేంద్రం భవనాల నిర్మాణాలు కూ డా చేపట్టేశారని సమాచారం. రోజు రోజుకు హైల్యాండ్‌ మైదానం స్థలాలు కబ్జాకు గుర వుతుండటం గమనార్హం. అంగనవాడీ కేంద్రం భవనాలతో పాటుగా అప్పటి వైసీపీ అధికార అం డతో ఏకంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టేశారు. ఇదంతా కూడా అధికారుల అండదండలతోనే జరుగుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. 3.70 ఎకరాల జూనియర్‌ కళాశాలకు చెందిన స్థలాలు రోజురోజుకు కుంచించుకు పోతున్నాయి. కొందరు వైసీపీ నాయకులు ఈ స్థలాల్లో ఇఽళ్ల నిర్మాణాలు మంజూరు చేయిస్తామని పైరవీలు సాగించినట్లు సమాచారం. కొందరైతే ఏకంగా ఇంటి పట్టాలు ఇప్పిస్తామని రెవెన్యూ అధికారులతో కుమ్మకై అవి నీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. హైల్యాండ్‌ మైదానంలో నిర్మించిన బస్‌షెల్టర్‌, సమీపంలో అక్రమంగా బంకులు, నిర్మాణాలతో స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఒకప్పుడు ఎంతో విశాలంగా క్రీడాకారులకు ఎంతో గుర్తింపుగా ఉండే హైల్యాండ్‌ మైదానం నేడు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించు కునేవారులేరు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల యాజమాన్యం, అధికారులు దృష్టి సారించి కళాశాలకు చెందిన హైల్యాండ్‌ స్థలాలను కబ్జాదారుల కబందహస్తాల నుంచి పరి ర క్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

వాల్మీకిపురం సమీపంలోని పింగాణి ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉండే హైల్యాండ్‌ మైదానం స్థలా లు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు సంబంఽధిం చినవే. 2019, 2022లలో రెండు సార్లు సర్వే నిమిత్తం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ల డం జరిగింది. హైల్యాండ్‌ మైదానంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ఆదేశాల మేరకు తగు చర్య లు తీసుకోవడం జరుగుతుంది. హైల్యాండ్‌ స్థలాలు పూర్తిగా జూనియర్‌ కళాశాలకు సం బంధించినవే. అక్రమ నిర్మాణాలు, అక్రమణ లపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా ఉన్నతా ధికారులకు నివేదిస్తాం.

- ఉమా అమరేశ్వరి, ప్రిన్సిపాల్‌, పీవీసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వాల్మీకిపురం

Updated Date - Jul 28 , 2024 | 11:30 PM