Share News

హామీల అమలులో జగన విఫలం

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:43 AM

ఎన్నికల హామీల అమలులో సీఎం జగన 85శాతం విఫలమయ్యారని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు.

హామీల అమలులో జగన విఫలం

మదనపల్లె టౌన, డిసెంబరు 31: ఎన్నికల హామీల అమలులో సీఎం జగన 85శాతం విఫలమయ్యారని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జగన ఎన్నికల వైఫల్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ పాదయాత్రలో జగన ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకు 730 హామీలు గుప్పించారన్నారు. వాటిలో 109 మాత్రమే అమలు చేశారని, మిగిలిన 85శాతం విస్మరిం చారన్నారు. ప్రజలపై ఇంటిపన్నులు, చెత్తపన్నులు బాదుతూ దోచుకు తింటున్నారన్నారు. ప్రజలే జగన ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే వున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మల పాటి యశశ్విరాజ్‌, చాణుక్యతేజ, తులసీధర్‌నాయుడు, బందార్ల రవి, చల్లా నరసింహులు, కె.శ్రీరామ్‌, పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:43 AM