కోళ్లబైలులో అక్రమాలను అరికట్టాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:49 PM
మండలంలోని కోళ్లబైలు పంచాయతీ అక్రమాలను, భూకబ్జాలను అరికట్టాలని సోమవారం ప్రజలు వైఎస్సార్ కాలనీ. బయ్యారెడ్డి కాలనీల్లో ధర్నా చేశారు.

మదనపల్లె అర్బన, జూన 17: మండలంలోని కోళ్లబైలు పంచాయతీ అక్రమాలను, భూకబ్జాలను అరికట్టాలని సోమవారం ప్రజలు వైఎస్సార్ కాలనీ. బయ్యారెడ్డి కాలనీల్లో ధర్నా చేశారు. రెవెన్యూ అధికారులు ప్రభు త్వ స్థలంగా గుర్తించి హెచ్చరిక భోర్డులు నాటినా ఖాతర్ చేయకుండా అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది నకిలీ పట్టాలు సృష్టించుకుని రాత్రికి రాత్రే నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంగా రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యా దు చేసిన పట్టించుకోవడంలేదని వారు వాపోతున్నారు. గత జగన ప్రభుత్వం అక్రమార్కులకు ఒత్తాసు పలికిందని వారు ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే షాజహానబాషా ప్రత్యేకంగా చొరవ చూపి ప్రభుత్వ స్థఽలాలను కాలనీల్లో కమ్యూనిటీ, పార్కుల కోసం కేటాయించా లని వారు కోరారు. కార్యక్రమంలో రెడ్డి, చలపతి, ఉపసర్పంచ భర్త నాగరాజ, అంజి, రాము, నరేష్‌రాజు, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.