Share News

లెక్కింపుపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - May 31 , 2024 | 10:54 PM

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్‌ ఏజెం ట్లు, రాజకీయ పార్టీల అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలని రిటర్నిం గ్‌ అధికారి హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

లెక్కింపుపై అవగాహన పెంచుకోవాలి
ఓట్ల లెక్కింపుపై వివరిస్తున్న ఆర్‌ఓ హరిప్రసాద్‌

మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

ప్రతి నియోజకవర్గానికీ ఒక కేంద్ర సర్వీసు అబ్జర్వర్‌

మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో 14 టేబుళ్లు

మదనపల్లె టౌన్‌, మే 31: ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్‌ ఏజెం ట్లు, రాజకీయ పార్టీల అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలని రిటర్నిం గ్‌ అధికారి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో కౌంటింగ్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీ ల అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెం ట్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆర్‌ఓ మాట్లాడుతూ కౌంటింగ్‌ హాల్లో 14 టేబుళ్లు వుంటా యని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లు లెక్కిస్తార న్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, నిర్దే శకాలతో పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కి స్తారన్నారు. అనంతరం తొలి రౌండ్‌లో 14 టేబుళ్లలో ఈవీఎంకు అనుసంధానించిన కంట్రోల్‌ యూని ట్‌లో పోలైన ఓట్లు లెక్కిస్తారన్నారు.

ప్రతి నియోజకవర్గానికి కేంద్ర సర్వీసు నుంచి ఒక అబ్జర్వర్‌ వస్తారని, ప్రతి రౌండ్‌లో వారికి డౌట్‌ వచ్చిన రెండు టేబుళ్లలో లెక్కించిన ఓట్ల ను మళ్లీ మైక్రో అబ్జర్వర్‌ సమక్షంలో లెక్కిస్తార న్నా రు. ఓట్ల లెక్కింపులో తేడాలొస్తే కౌంటింగ్‌ అధికారులను బాధ్యులు చేస్తూ సస్పెండ్‌ చేస్తారన్నారు. ప్రతి రౌండ్‌లోనూ లెక్క తేలాక కౌంటింగ్‌ ఏజెంట్లు సంతకం పెట్టాలన్నారు. ప్రతిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ రౌండ్‌ రౌం డ్‌కు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. సమావేశం లో ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహాన్‌బాషా, వైసీపీ అభ్యర్థి నిస్సార్‌ అహ్మద్‌, కౌంటింగ్‌ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో 14 టేబుళ్లు - 17 రౌండ్లు

ములకలచెరువు, మే 31: ఎన్నికల కౌంటింగ్‌ గడువు సమీపిస్తుండడంతో గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 13వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్‌లో 2,24,802 ఓట్లకు 1,86,798 మంది ఓటు హక్కును వినియోగించుకున్నా రు. నియోజకవర్గంలో మొత్తం 236 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేయనుండగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు అధికా రు లు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అన్ని నియో జకవర్గాలకంటే తక్కువగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో మొదటి ఫలితం తంబళ్లపల్లె వచ్చే అవకాశం ఉంది. తొలుత ములకలచెరువు మం డలం గూడుపల్లె పోలింగ్‌ కేంద్రం ఓట్లు లెక్కిం చనుండగా చివరగా కురబ లకోట మండలం అంగళ్లు ఓట్లను లెక్కిస్తారు. మొదట ములకల చెరువు, తరువాత తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, చివరగా కురబ లకోట మండల ఓట్లను లెక్కించిన తరువాత కౌంటింగ్‌ పూర్తవుతుంది.

Updated Date - May 31 , 2024 | 10:54 PM