Share News

విజిలెన్స దాడుల్లో రూ.4.28 లక్షల ఎరువులు సీజ్‌

ABN , Publish Date - Jul 07 , 2024 | 11:45 PM

బి.కొత్తకోట పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించి రూ.4.28 లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేశారు.

 విజిలెన్స దాడుల్లో   రూ.4.28 లక్షల ఎరువులు సీజ్‌
ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్న విజిలెన్స అధికారులు

బి.కొత్తకోట, జూలై7: బి.కొత్తకోట పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించి రూ.4.28 లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేశారు. అగ్రికల్చర్‌ కమిషనరేట్‌ గుంటూరు వారి ఆదేశాల మేరకు సాల్‌రెడ్డి ఏడీఏ కర్నూల్‌, విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ రామక్రిష్ణలతో కూడిన అధికారుల బృంధం పట్టణంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మిక తని ఖీలు చేశారు. ఇందులో ఎరువులు, పురుగుమందుల విక్రయా లు, నిల్వలకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించగా యంవీఆర్‌ సీడ్స్‌ దుకాణంలో అమ్మకాలు, బిల్లులు సరిగా లేని కారణంగా రూ.4.28 లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేసి దుకా ణ లైసెన్సను 15 రోజులపాటు సస్పెండ్‌లో ఉంచారు. అదే విధంగా బాలాజి ఫర్టిలైజర్స్‌ దుకాణంలో తనిఖీలు చేయగా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఒకే దుకాణంలో విక్ర యించడం నిబంధనలకు విరుధ్ధమని గుర్తించి 16.9 టన్నుల ఎరువుల నిల్వలకు సంబంధించి తేడాలు ఉండటంతో ఈ షాపు లైసెన్స రద్దుకు జిల్లా వ్యవసాయ అధికారులకు సిఫారసు చేస్తున్నట్టు సాల్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏవో ఆపీస్‌ ఏవో వెంటమోహన, బి.కొత్తకోట ఏవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

గుర్రంకొండలో:ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయి స్తున్న ఎరువులను కర్నూలు వ్యవసాయ సహాయ సంచాలకులు సాలు రెడ్డి ఆదివారం సీజ్‌ చేసినట్లు తెలిపారు. గుర్రంకొండ పట్టణం లో పలు ఎరువుల దుకాణదారులు నకిలీ ఎరువులను విక్రయి స్తున్నట్లు రైతులు విజిలెన్స అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తిరుపతి విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎరువుల దుకాణాలపై తనిఖీ చేశారు. ఇందులో పుడమి కిసాన మార్ట్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించి 1.59 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ను సీజ్‌ చేశారు. అధికారులు సీజ్‌ చేసిన ఎరువుల విలువ రూ.1.92 లక్షలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స ఎస్‌ఐ రామకృష్ణ నాయక్‌, ఏవో వెంకటస్వామి, నవీనరెడ్డిలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ధరలకే ఎరువులను విక్రయించాలి

కురబలకోట, జులై 7: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువు లు, క్రిమిసంహారక మందులు, విత్తనాలను విక్రయించాలని కర్నూల్‌ ఏడీఏ సాలురెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండ లంలోని అంగళ్ళులో ఎరువుల దుకాణాలను విజిలెన్స అధికా రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ఎరువుల అమ్మకాలు చేప ట్టాలని, అలా కాకుండా నకిలీ ఎరువులు విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువులు స్టాక్‌కు సంబంధించి రికార్డుల నమోదుతో పాటుగా బిల్లులు సక్రమంగా ఉంచాలని పేర్కొన్నారు. తనిఖీల్లో విజిలెన్స అధికారులు రామ కృష్ణానాయక్‌, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Jul 07 , 2024 | 11:45 PM