పేపర్లు చింపితే పదవులు వచ్చాయి..!
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:13 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎంపీటీసీ, సర్పంచ ఎన్నికల్లో అధికారులను అడ్డుపెట్టుకొని నామినేషన్లు చించివేస్తే కొందరు వైసీపీ ఎంపీటీసీలకు పదవులు వచ్చాయని చెర్లోపల్లె టీడీపీ ఎంపీటీసీ రెడ్డిప్రసాద్‌నాయుడు ధ్వజమెత్తారు.
వైసీపీ ఎంపీటీసీలపై టీడీపీ ఎంపీటీసీ ధ్వజం అభివృద్ధి పనులపై అధికారుల నిలదీత వాడివేడిగా మండల సమావేశం
గుర్రంకొండ, జూలై 15:వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎంపీటీసీ, సర్పంచ ఎన్నికల్లో అధికారులను అడ్డుపెట్టుకొని నామినేషన్లు చించివేస్తే కొందరు వైసీపీ ఎంపీటీసీలకు పదవులు వచ్చాయని చెర్లోపల్లె టీడీపీ ఎంపీటీసీ రెడ్డిప్రసాద్‌నాయుడు ధ్వజమెత్తారు. గుర్రంకొండ మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ సీతమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై అధికారులు వివరాలు ఇవ్వాలని ఎంపీటీసీ రెడ్డిప్రసాద్‌నా యుడు సమావేశంలో నిలదీశాడు. గతంలో జరిగిన సమావేశాలకు సభ్యు లు వచ్చి వెళ్లిపోవడం తప్ప అభివృద్ధి పనులపై చర్చించిన దాఖాలాలు లేవన్నారు. దీంతో మూడేళ్లులో మండలంలో జరిగిన అభివృద్ధి శూన్య మన్నారు. అంతట సమావేశంలో ఉన్న గుర్రంకొండ-2 వైసీపీ ఎంపీటీసీ ఖదీరుల్లా అడ్డుతగలాడు. దీంతో రెడ్డిప్రసాద్‌నాయుడు తాను రెండు సార్లు ప్రజలు ఓట్లు వేస్తే భారీ మెజారిటీతో ఎంపీటీసీగా గెలిచానని మీ మాదిరిగా అధికారులు ఎన్నికల్లో పేపర్లు చింపితే పదవులు రాలేదని ఘాటుగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి గెలిస్తేనే విలువ ఉంటుందన్నారు. అనంతరం అధికారులు మూడేళ్లలో జరిగిన అభివృద్ధి పనులపై వివరాలను ఇస్తామని చెప్పడంతో శాంతించారు. అలాగే గుర్రంకొండ పట్టణంలో ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులను ఇష్టానుసారంగా విక్రయిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఓ ఎంపీటీసీ వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. ఎరువుల దుకాణాలపై దాడులు చేసి రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల బిల్లులను సకాలంలో చెల్లించాలని అధికారులకు తెలిపారు. అలాగే గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో జగదీశ్వరరెడ్డి కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సమ్రీన, ఎంపీటీసీ, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.