Share News

న్యాయం కోసం వెళితే పోలీసులు కొట్టారు

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:39 PM

తమ భూమిని ఇతరులు ఆక్రమించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేయాల్సిన పోలీసులు తమనే కొట్టారని రైతు aసి.ప్రతాప్‌ ఆరోపించారు.

న్యాయం కోసం వెళితే పోలీసులు కొట్టారు
విలేకర్లతో మాట్లాడుతున్న బాధిత రైతు ప్రతాప్‌

మదనపల్లె టౌన్‌, మార్చి 26: తమ భూమిని ఇతరులు ఆక్రమించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేయాల్సిన పోలీసులు తమనే కొట్టారని రైతు సి.ప్రతాప్‌ ఆరోపించారు. బాఽధితుడి కథనం మేరకు తన తండ్రి సి. కృష్ణయ్య ఆధీనంలో అంకిశెట్టిపల్లె పంచాయతీ ఖాతా నెంబరు 218కు చెందిన 2..40 ఎకరాల భూమి 20 ఏళ్లుగా ఉంది. ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేక తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ భూమిని జగన్నాథం, చంద్రకళ, నవీన్‌ ఆక్రమించుకున్నారు. దీనిపై మదనపల్లె తాలూకా పోలీసులకు డిసెంబరు 11న ఆన్‌లైన్‌లో, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని మదనపల్లె డీఎస్పీకి రిజిస్టర్‌ పోస్టుద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఫిబ్రవరి 19న అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వారు మదనపల్లె తాలూకా ఎస్‌ఐ రవికుమార్‌కు విచారణకుఆదేశించారు. కానీ రవికుమార్‌ తనకు న్యాయం చేయకపోగా, భూమిలోకి వెళ్లిన తన అన్న, చెల్లెలు కోకిలను విచక్షణ రహితంగా కొట్టారన్నారు. ఈ విషయమై సీఐ శేఖర్‌కు సమాచారం అందించి మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చేరామన్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై తాలూకా సీఐ శేఖర్‌ను వివరణ కోరగా పోలీసులు బాధితులను కొట్టలేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని సీఐ చెప్పారు.

Updated Date - Mar 26 , 2024 | 10:39 PM