Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

సంక్షేమ పథకాలు నిజమైతే చీరల పంపిణీ ఎందుకు?

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:47 AM

ఒక్కో అక్క చెల్లె మ్మకు సంక్షేమ పథకాల ద్వారా లక్ష లాది రూపాయల అందజేశామని చెపుతున్న వైసీపీ నాయకులు ఇప్పు డు చీరలు నెలన్నర ముందుగానే ఎం దుకు పంచుతున్నారని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కు మార్‌ రెడ్డి ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలు నిజమైతే చీరల పంపిణీ ఎందుకు?
సమావేశంలో మాట్లాడుతున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

ఫ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌ రెడ్డి నిలదీత

కలికిరి, మార్చి 3: ఒక్కో అక్క చెల్లె మ్మకు సంక్షేమ పథకాల ద్వారా లక్ష లాది రూపాయల అందజేశామని చెపుతున్న వైసీపీ నాయకులు ఇప్పు డు చీరలు నెలన్నర ముందుగానే ఎం దుకు పంచుతున్నారని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కు మార్‌ రెడ్డి ప్రశ్నించారు. రాజంపేట నుంచి పీలేరు వరకూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ మిథున రెడ్డి చీరల పంపిణీని మొదలు పెట్టారని, అక్రమ సంపాదనతో కూడబెట్టిన అవినీతి సొమ్ముతో కొన్న చీరలతో ఓటర్లకు గాలం వేస్తున్నా రని విమర్శించారు. ఆదివారం మండలంలోని నగరిపల్లెలో జరిగిన ఆరు మండలాల టీడీపీ, జనసేన శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరాచకా లు, అక్రమాలు, దోపిడీలతో ఐదేళ్లు పరిపాలించిన జగన్మోహన రెడ్డి ఇక ఏమీ లేక ఆఖరుకు రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారని ఇంతకన్నా ఘోరం చరిత్రలో లేదని విమర్శించారు. సమావేశంలో ఆరు మండలాల మండల టీడీపీ అధ్యక్షులు శ్రీకాం త రెడ్డి, ప్రభాకర్‌ నాయుడు, నిజాముద్దీన, జగదీష్‌, మల్లికార్జున రెడ్డి, గీతాంజలి, నాయ కులు మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు నిరంజన రెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, దద్దాల హరిప్రసాద్‌, అగ్రహారం అమరనాథరెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, కలికిరి సర్పంచు ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, సుధాకర్‌ నాయుడు, వలిగట్ల వెంకట్రమణ, బూత, కస్టర్‌ ఇనచార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - Mar 04 , 2024 | 12:47 AM