Share News

కనీస వేతనాలు అడిగితే కక్షసాధింపా..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:47 PM

అంగన్వాడీలు చేస్తున్న కష్టానికి ఫలితంగా కనీస వేతనాలు ఇవ్వమని కోరితే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు.

కనీస వేతనాలు అడిగితే కక్షసాధింపా..!
మదనపల్లెలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

ఫ మదనపల్లెలో కళ్లకు గంతలు కట్టుకుని అంగన్వాడీల నిరసనలు ఫ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదంటున్న వైనం

వాల్మీకిపురం, జనవరి 12: అంగన్వాడీలు చేస్తున్న కష్టానికి ఫలితంగా కనీస వేతనాలు ఇవ్వమని కోరితే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. శుక్రవారం స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద సీడీపీవో ద్వారా వచ్చిన నోటీసులను అంగన్వాడీలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వా డీలను తొలగించే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉన్నాయా అని ప్రశ్నిం చారు. ఓపికతో ఉన్నామని తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరిం చారు. గత 32రోజులుగా ఎంతో సామరస్యంగా సమ్మె చేపడితే ఇదే అదనుగా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందని ధ్వజ మెత్తారు. తమ కనీస డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టు కార్యాలయంలో ఏమి చేస్తున్నారో తమ కంతా తెలునని ఇకపై అధికారుల ఆటలు కూడా సాగనివ్వమన్నారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, ప్రసన్న, అమ్మాజి, రెడ్డిరాణి, దేవసేన, లక్ష్మీనరసమ్మ, వాల్మీకిపురం, కలికిరి, గుర్రంకొండ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొన్నారు.

మదనపల్లె టౌనలో: అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్క రించాలని 32 రోజులుగా అరచి కొట్టుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని నేతలు ధ్వజమెత్తారు. దేవుడా..! ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి..మా గోడు వినిపించు అంటూ అంగన్వాడీలు నిరసనలు తెలిపారు. శుక్రవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద మదనపల్లె ప్రాజెక్టుకు చెందిన అంగన్వాడీలు కళ్లకు నలుపుగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తాము న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరితే, ఎస్మా ప్రయోగించడం, ఉద్యోగాలు తొలగిస్తామని షోకాజ్‌ నోటీ సులు ఇవ్వడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మదనపల్లె, నిమ్మన పల్లె, రామసముద్రం అంగన్వాడీలు, సెక్టార్‌ లీడర్లు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 32వ రోజుకు చేరుకోగా రిలే నిరాహా రదీక్ష ఏడవ రోజుకు చేరుకుంది. తంబళ్లపల్లె ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి లోని అంగన్వాడీలు, హెల్పర్లు తంబళ్లపల్లె మూడు రోడ్ల కూడలిలో సమ్మె శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. శుక్రవారం నాడు మంత్రుల కమిటీతో చర్చలు ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం మొండి పట్టు వీడి తమ సమస్యలు పరిష్కరించేలా కరుణించు స్వామి..శ్రీ అంటూ మల్లయ్యకొండ మల్లికార్జున స్వామికి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా యూనియన ప్రతినిధులు మాట్లాడుతూ.. జీతాల పెంపు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుట్‌ అమలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5లక్షలు, ఉద్యోగ భద్రత అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమం లో యూనియన ప్రతినిధులు కరుణశ్రీ, గౌరి, ఉమా దేవి, సులోచన, సరస్వతి, స్వరూపారాణి, శివమ్మ అంగన్వాడీలు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో : బి.కొత్తకోట ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 32వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు అంద రూ చెవులను మూసుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీ లీడర్లు శ్రీవా ణి, చాంద్‌బీ, కుమారిలు మాట్లాడుతూ జీవో నంబర్‌ 2కు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపబో మన్నారు. కార్యక్రమంలో బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం మండ లాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:47 PM