Share News

కొత్త చట్టాలను ప్రయోగిస్తే..కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:58 PM

ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రయోగిస్తే తాము కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని అంగన్‌వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. సుండుపల్లె మండల కేంద్రంలో అంగన్వా డీ కార్యకర్తలు జీవో నెంబర్‌ 2 కాపీలకు నిప్పం టించి నిరసన వ్యక్తం చేశారు.

కొత్త చట్టాలను ప్రయోగిస్తే..కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం
సుండుపల్లె: జీవో నెంబర్‌-2 కాపీలను దహనం చేస్తున్న అంగన్వాడీలు

సుండుపల్లె, జనవరి7: ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రయోగిస్తే తాము కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని అంగన్‌వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. సుండుపల్లె మండల కేంద్రంలో అంగన్వా డీ కార్యకర్తలు జీవో నెంబర్‌ 2 కాపీలకు నిప్పం టించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ విశ్వనాఽథ్‌ నాయక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా కార్మికులపై జీవో నెంబర్‌ 2ను ప్రయోగించ డం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా, రాష్ట్ర ప్రభు త్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విమర్శించారు. మం డల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వా డీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు ఎస్టీయూ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏఐటీ యూసీ నాయకురాలు నాగేశ్వరి, సుజాత, ఎస్టీయూ నేత ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

రాజంపేట టౌన్‌: అంగన్‌వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టం నిరసన వ్యక్తం చేస్తూ ఆ జీవో కాపీలను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్ర తిపక్షంలో ఉండగా గుప్పించిన హామీలు అమలు చేయకపోగా, బలవంతంగా ఆందోళన విరమింపజే సేందుకు జీవో జారీ చేయడం దారుణమన్నారు. అంగన్‌వాడీ నాయకురాలు విజయ, అమరావతి, శివరంజిని, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరాటాలు ఆగవని ప్రాజెక్టు అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. రైల్వేకోడూరు అంగన్వాడీ నాయకురాళ్లు పద్మ, లీలా, శిరీషా, దుర్గా, రాధ తదితరులు పాల్గొన్నారు.

చిట్వేలి : చిట్వేలి ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద సీఐ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు అధ్యక్షతన ఎస్మా జీవో కాపీలను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవోల పేరుతో భయపెట్టే ధోరణి మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పం దికాల మణి, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు యదు రూరి సుజాత, పగడాల సుధామణి, బండారు శిరీ ష, సుజన, శ్రీదేవి, రాధ, సులోచన, సీఐటీయూ మండల అధ్యక్షుడు కొతత నాని, ఆయాలు కార్య కర్తలు పాల్గొన్నారు.

రాయచోటిటౌన్‌: ఎస్మా ప్రయోగం అప్రజాస్వామిక మని జనవిజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘాల నేతలు హరిశర్మ, ప్రతాప్‌రెడ్డి, రవిశంకర్‌, రెడ్డెయ్య, లంబాడీ హక్కుల సంఘం జాతీయ నాయకుడు శంకర్‌నాయక్‌, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు రమణ, మహమ్మద్‌అలీ తదితరులు విమర్శించారు అంగ న్వాడీల రిలే నిరాహార దీక్షకు వారు ఆదివారం సంఘీభావం తెలిపారు. దోపీడీ చేసే వారికి అంద లాలు, కార్పొరేట్లకు రాయితీలు, రుణమాఫీలు చేయడంతోపాటు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులు, స్కీం వర్కర్ల శ్రమను దోచుకునే వైనాన్ని ఎండగట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, లక్కిరెడ్డిపల్లె ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఓబులమ్మ, భూకైలేశ్వరి, లక్ష్మిదేవమ్మ ఉమాదేవి, విజయమ్మ, మస్రూన్‌బీ, నందిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 10:59 PM