Share News

నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:29 PM

మండలంలోని కోళ్లబైలు పంచా యతీలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు చూపించాలంటూ ఏపీ మహిళా సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు.

నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
పేదలతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 27: మండలంలోని కోళ్లబైలు పంచా యతీలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు చూపించాలంటూ ఏపీ మహిళా సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సీపీఐ కార్యవర్గసభ్యుడు శ్రీనివా సులు, ఏపీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ మాట్లాడుతూ కోళ్లబైలు పంచాయతీలోని నిరుపేదలు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది పైగా గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఇంటి స్థలాలను చూపించలేదని ఆరోపించారు. మదనపల్లె చుట్టుపక్కలే ఉన్న ప్రభుత్వభూములను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పేదలకు మాత్రం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలాలను ఇస్తున్నారని ఆరోపించారు. కోళ్లబైలు పంచాయతీలోని ప్రభుత్వ భూములు నిరు పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మురళి, నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు సూరి, మహిళసంఘం నాయకురాలు లక్ష్మీతోపాటు నిరుపేదలు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 10:30 PM