ములకలచెరువులో భారీ వర్షం
ABN , Publish Date - May 09 , 2024 | 12:09 AM
ముల కలచెరువులో బుఽధవారం తెల్లవారుజాయున భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల సమయంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురియ డంతో పంటలకు నష్టం వాటి ల్లింది.
ములకలచెరువు, మే 8: అలాగే పలు గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి తోటల్లోని మామిడి రాలి కాయల రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని పర్తికోట పంచాయతీ కన్నెమడుగువారిపల్లె సమీపంలో సాగులో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింతి. దీంతో రైతు బాలకృష్ఱారెడ్డికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. వర్షంతో ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం కలిగింది. ములకలచెరువులో కురిసిన వర్షం 49.4 మి.మీటర్లుగా నమోదైంది.
బి.కొత్తకోటలో: బి.కొత్తకోట మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ తాకిడికి అల్లాడి పోతున్న జనానికి ఊరట లభించినట్లయింది. మదనపల్లె డివిజనలోనే అత్య ధికంగా బి.కొత్తకోట మండలంలో 80.0 మిమీ ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పెద్ద ఎత్తున వర్షం పడినప్పటికీ ఎటువంటి ఆస్థినష్టం జరగలేదని తహశీల్దార్ పుణ్యవతి తెలిపారు. కాగా పట్టణంలోని వాయిలవంక వీధిలో తోపుడుబండి పై వ్యాపారం చేసుకునే టి.నయీం నివాసగృహానికి వున్న పైకప్పు ముందుభాగం కూలిపోయింది. కుటుంబీకులకు ఎటువంటి అపాయం జరగలేదు.