Share News

హరహర మహాదేవ.. శంభో శంకర

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:08 AM

మహాశివరాత్రి వేడుకలను పురస్కరించు కుని హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తుల శివనామస్మ రణతో శైవక్షేత్రాలు మార్మోగాయి,

హరహర మహాదేవ.. శంభో శంకర
పీలేరులోని కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకుంటున్న భక్తులు

ఫభక్తుల శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు ఫ భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు ఫమహాశివుడికి అభిషేకపూజలు, కల్యాణోత్సవాలు ఫ పలుచోట్ల అన్నదానాలు

మదనపల్లె అర్బన, మార్చి 8:మహాశివరాత్రి వేడుకలను పురస్కరించు కుని హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తుల శివనామస్మ రణతో శైవక్షేత్రాలు మార్మోగాయి, మదనపల్లె పట్టణంతోపాటు మండ ల పరిధిలో మహాశివరాత్రి వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధల తో నిర్వహించుకున్నారు. పట్టణంలోని దేవళంవీధిలో గల సోమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు ఫణేంద్రస్వామి వేకువజాము నుంచే మహన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సీటీఎం రోడ్డులోని మంజునాథ స్వా మి ఆలయంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసి అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. నీరు గట్టువారిపల్లెలో నీలకంఠేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేశారు. మధ్యా హ్నం ఆలయ దర్మకర్త గుడి రామాంజులు ఆధ్వర్యంలో పార్వతీ సమేతం నీలకంఠేశ్వరుడికి గిరిజా కల్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణం తిలకించారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పుష్పపల్లకి వాహనంలో పురవీధులో తమిళనాడు డ్రమ్స్‌, కోలాటం, చెక్కభజనల తో ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. గెవిగుండులో వెలసిన గెవిగంఽగాధర స్వామికి రుద్రాభిషేకంతోపాటు విశేషపూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి రావడంతో ఆలయ ఆవరణం భక్తులతో కిటకిటలాడింది. ర భక్తులకు అన్నదానం చేశారు. వేంపల్లె గ్రామం సమీపంలో వెలసిన ఏకశిలా రూపంలోని మల్లేశ్వరస్వామిని భక్తులు వేలాధిగా తరలివెళ్లి దర్శించుకున్నారు. వరసిద్ధివినాయక స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయకమిటీ అధ్యక్షుడు సిద్దులు, గౌరవాధ్యక్షుడు కాలా సోముశేఖర్‌ ఆధ్వర్యంలో వినాయకుడికి అర్చనలు . విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు శివనామస్మ రణలతో మారుమ్రోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్థానిక సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకు డు మహేష్‌ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, చేశారు. ఆలయం వద్ద నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.

సాయంత్రం స్వామి వారిని తంబళ్లపల్లె పురవీధుల్లో ఉరేగిం చారు.

పీలేరులో: హరహర మహాదేవ...శంభో శంకరా...అంటూ మహాశివరా త్రి పర్వదినాన్ని శుక్రవారం పీలేరు మండల వాసులు అంగరంగ వైభ వంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే పీలేరు పట్టణంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, శివరామపురంలోని భ్రమరాంబ మల్లిఖా ర్జున స్వామి ఆలయం, అడవిపల్లె మద్గుండాల మల్లేశ్వరస్వామి ఆల యాలకు భక్తులు పోటెత్తారు. ఆయా ఆలయాల్లోని స్వామి, అమ్మ వార్లను ఆయా ఆలయాల ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నగర సంకీర్తన, రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం గిరిజా కల్యాణం, రాత్రి లింగోద్భవ సమయంలో స్వామి వారికి 108 లీటర్ల పాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత దీపాల కాంతులతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది. శివరామపురంలోని భ్రమరాంబ మల్లిఖార్జు న స్వామి ఆలయంలో స్వామి వారికి రుద్రనమక, చమక, పురుష సూక్త విధానంలో అర్చన, మహానైవేద్యం నిర్వహించారు. అడవిపల్లె మద్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ఏర్పాటు చేశారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కచేరి నిర్వహించగా భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో పీలేరు శ్రీ వేంకటేశ్వర నాట్య కళామండలి సభ్యులు వీధి నాటకం, చెక్క భజనలు నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు వారణాశి మోహన రెడ్డి, సభ్యులు సుధాకర, విజయ్‌ కుమార్‌, సుమన, మల్లిఖార్జున, రవి, వంశీ, వినయ్‌, పోతం శెట్టి రమేశ్‌, ఆటో బాషా, చానబాషా, ఉద్యా ఫణీంద్రశర్మ, మయూర్‌ నాథ శర్మ, వెంకటరమణ నాయునివారు, శిరీష, అబ్బవరం సందీప్‌ రెడ్డి, అబ్బవరం మల్లిఖార్జున రెడ్డి, ఆంజనేయులు, హరి పాల్గొన్నారు.

గుర్రంకొండలో: మహాశివరాత్రి సందర్భంగా గ్రుంకొండ సిద్దేశ్వరస్వా మి ఆలయం, బురుజుపల్లె ఉమామహేశ్వరస్వామి ఆలయం, ప్యారం పల్లె కాశీవిశ్వనాథ ఆలయం, సరిమడుగు మల్లికార్జునస్వామి ఆల యం, సిద్దేశ్వర ఆలయంతోపాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే అర్చన, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, బిల్వార్చన, విశేష పూజలను చేశారు. స్వామి వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయాల వద్ద భక్తులకు అన్నదాన, తీర్థప్రసాదాలను అందజేశారు.

కురబలకోటలో: మండలంలోని అంగళ్లు సమీపంలో వెలసిన మల్ల య్యకొండలో శుక్రవారం శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. కురబలకోటలోని శివాలయం, ముదివేడు, మల్లయ్యకొండలను చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనడం తో ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు ఆందజే శారు. అలాగే కొండపై అన్నదానం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులు నడిపారు.

ములకలచెరువులో: మండలంలో శుక్రవారం మహా శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ములకలచెరువు సమీపంలోని కనుగొండరాయస్వామి, రామాపురంలోని రామలింగేశ్వరస్వామి, గూడు పల్లె, వేపూరికోట, బురకాయలకోట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమా లు నిర్వహించారు.

పెద్దమండ్యంలో: మండలంలో శుక్రవారం మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని పెద్దమండ్యం, ముసలికుంట, శివపురం, నగరి, పాపే పల్లి, సిద్దవరం శివాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. శివపా ర్వతులకు అభిషేకాలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో తంబళ్లపల్లి మల్లయ్య కొండకు కాలినడకన వెళ్లే భక్తులు శివురం నేలమల్లయ్య స్వామిని దర్శించుకున్నారు. పలు గ్రామాల్లో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపులు చేశారు. శివాలయం వద్ద అన్నదానం కార్యక్రమం జరిగాయి.

నిమ్మనపల్లిలో: మండలంలోని తవళం పంచాయతి అటవీప్రాంతం బాహుదా ఉపనది కుమారస్వామి పశ్చిమ భాగాన వెలసిన నేలమ ల్లేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కాగా స్వయంభు బాలాశంకుడి గుడి నిర్మాణం జరుగు తుండడంతో పక్కనే ఉన్న సత్రంలో ఉత్సవ విగ్రహలు ఏర్పాటు చేసి భక్తులకు దర్శభాగ్యం కల్పించారు. అలాగే గార్గేయ ఖిఖరంలో అఖండ జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. స్వామివారి కల్యాణోత్సవంలో పలువురు భక్తులు పాల్గొన్నట్లు ఈవో మంజుల తెలిపారు. భక్తుల కోసం అన్నదానంతో పాటు గుడి వద్దకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు.

బి.కొత్తకోటలో: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండ లంలోని పలు శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని దిగువ బస్టాండులో ఉన్న శివాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహంచారు. బీరంగి పంచాయతీ శివారులో వెలసిన బండెన్నస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నసంతర్పణ, చెక్కభజనలు రాత్రికి భక్తుల జాగరణ కోసం సాసవులచిన్నమ్మ కథను ఏర్పాటు చేసినట్టు ఆలయ ధర్మకర్త లక్ష్మీపతి తెలిపారు.

పెద్దతిప్పసముద్రంలో: పీటీఎంలోని పలు శివాలయాలు మహాశివ రాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. పీటీఎంలోని పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి, రంగసముద్రం రామలింగేశ్వరస్వామి, టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లె వద్ద గల ప్రసన్న పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, రుధ్రాభి షేకం, నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాల్లో ఆల యాల్లోని భక్తులు చెక్కల భజనలు, కోలాటలు హరికథలు, అన్న మయ్య సంకీర్తనలతో ఆలయాల్లో రాత్రంతా భక్తులు కాలక్షేపం చేశా రు. స్థానిక పీటీఎంలో సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 12 గంటలకు లింగో ద్బవ సమయంలో పళ్ల రసాలతో అభిషేకం చేశారు. టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లె వద్ద గల సంగమేశ్వర ఆలయంలో శనివారం 12.30 గంటలకు స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ములకలచెరువు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.

రామసముద్రంలో: మండలంలోని పలు శివాలయాలు మహాశివరా త్రి సందర్భంగా భక్తుల శివనామాస్మరణతో మారుమ్రోగాయి. మండల కేంద్రంలోని వాలీశ్వరస్వామి, చంద్రశేఖరస్వామి మూగవాడి గ్రామంలోని పార్వతి సమేత పుండరీశ్వరస్వామి, కొండ శివాలయాల లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నా రు. ఈసందర్భంగా ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో అలంక రించారు. పలు ఆలయాలలో స్వామివారి కల్యాణోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వాలీశ్వరస్వామి కొండపై ఆదివారం రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:09 AM