ఘనంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:09 PM
బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పాతబస్టాండు కూడలిలో బీజేపీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు.
రాజంపేట, ఏప్రిల్ 6: బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పాతబస్టాండు కూడలిలో బీజేపీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నంద్యాల జిల్లా ఇనచార్జి పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశంలోనే బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ తీసుకోని విధంగా నిర్ణయాలు తీసుకుని చరిత్రనే తిరగరాసిందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400 పైచిలుకు స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జి.కె. నాగరాజు, పెనుగొండ రమణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పట్టు పోగుల సూర్యచంద్ర, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్, మండల ఉపాధ్యక్షుడు డాక్టర్ వేణుప్రసాద్‌రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు తోట నగేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తిపాటి నవీనకుమార్, స్థానిక ప్రజలుపాల్గొన్నారు.
రైల్వేకోడూరు(రూరల్): మైసూరివారిపల్లి పంచాయతీ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్ గడ్డం చెంగల్‌రాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి, వందలాది మోటార్ సైకిల్‌లతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, శ్రీ కృష్ణదేవరాయులు, అమరజీవి పొట్టి శ్రీరాములు, వడ్డీ ఓబన్న, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి ఘననివాళి అర్పిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనతల సురేష్, స్టేట్ హార్టికల్చర్ సెల్ మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు, జిల్లా హార్టికల్చర్ చైర్మన జయప్రకాష్ వర్మ, అసెంబ్లీ కో కన్వీనర్ గాజుల శ్రీనివాసులు, కార్య దర్శి జోగినేని సుబ్బారావు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నిర్మ లానంద, మండల మాజీ అధ్యక్షుడు వాకచర్ల సుబ్బారావు పాల్గొన్నారు.