Share News

హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:49 PM

జిల్లాలో బజార్లలో, షాపుల్లో, అంగళ్లలో లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ పనులు చేస్తున్న హమాలీ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డి మాండ్‌ చేశారు.

హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

రాయచోటి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి12: జిల్లాలో బజార్లలో, షాపుల్లో, అంగళ్లలో లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ పనులు చేస్తున్న హమాలీ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డి మాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు కోసం ఏఐటీయూసీ చాలాకాలంగా పోరాటం చేస్తోందని, అందులో భాగంగానే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్నామన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పా టు చేసి 45 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి నెలకు 6 వేలు పింఛను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలరన్నారు. పిల్లలు, గర్భిణులకు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా సమితి సభ్యుడు రఘునాథ్‌, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గంగులప్ప, నారాయణస్వామి, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:49 PM